భోగి పండుగ యొక్క విశిష్టతలు (pongal)
మన తెలుగు వారి పెద్ద పండుగ(pongal) మొదటి రోజున వచ్చే భోగి పండుగ యొక్క విశిష్టతలు:
భోగి : మూడు రోజుల పాటు జరిగే పండుగలో మొదటి రోజు భోగి పండుగ. ‘భోగి’ అనే పదానికి ‘తొలినాడు’ అనే అర్థం ఉన్నది. అనగా పండుగ తొలినాడు అని అర్థం. భోగి రోజున ఇంటి ముందర మంట వేయడం వలన ఇంటిలో ఉండే దారిద్య దేవతను తరిమినట్లు హిందువుల విశ్వాశం. భోగికి ముందు రోజున ఇంటిలో ఉండే పనికిరాని పాత వస్తువులని వేరి ఇంటిని శుభ్రపరచి భోగి రోజున ఇంటిముందు తెల్లవారుఝామున మంటలు వేయడం దక్షణ భారతీయుల అలవాటు . తాటి మట్టలు మరయు ఎండిన చెట్టు కొమ్మలుతో పెద్ద పెద్ద మంటలు వేయడం ఆంధ్ర వారి అలవాటు.
భోగి రోజు ముఖ్యంగా చేసే విధులు :
భోగి మంటలు, భోగి పళ్లు పోయడం, బొమ్మల కొలువు మొదలగునవి చేస్తారు. ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు.
గొబ్బెమ్మలు: మన తెలుగు వారి హిందూ సంప్రదాయంలో ‘గొబ్బి‘ గోపి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. గొబ్బెమ్మ అంటే ‘నమస్కారాల దేవత’మరియు ‘లోకజనని’ అనే బిరుదులున్నాయి. ఈ గొబ్బెమ్మ సాక్షాత్తూ గౌరీ స్వరూపమే. జానపదులు కూడా శక్తి స్వరూపిణియైన కాత్యాయనే గొబ్బెమ్మగా భావిస్తారు. ఈ నెలలో చలి అత్యధికంగా ఉంటుంది.
కాబట్టి అనేక సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభిస్తాయి అందువలన మన పెద్దలు మనకు ఎలాంటి విష జ్వరాలు ఎలాంటి అంటురోగం మన దగ్గరకు రాకుండా ఈ గొబ్బెమ్మలు పెట్టమని చెప్పారు . గోమయానికీ, గోమూత్రానికీ ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తి వుంటుంది. తేళ్లు, జెర్రులు వంటివి ఇంట్లోకి రావు. నీటిలో ఆవుపేడకలిపి ఇంటి ముందు జల్లుతారు. గొబ్బిళ్లపై చల్లే పసుపు కుంకుమకు క్రిములను హరించే గుణం వుంది. అసలు గొబ్బమ్మలు పెట్టడం ఈ సంక్రాంతి పండుగ యొక్క మరో విశిష్టత ఏమంటే ఆవుపేడను చిన్న చిన్న ముద్దలుగా చేసి, వాటిలో పసుపు, కుంకుమలతో అలంకరించడంతో పాటు వాటి మధ్యలో గరిక (గడ్డి), రేగుపళ్లు, నువ్వులు, పూలు పెడుతారు .. కొన్ని ప్రాంతాలవారు వాటి మధ్యలో నవధాన్యాలను ఉంచుతారు. ‘గొబ్బి’ గోపి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. గోపికలు కృష్ణు చుట్టూ చేరి సంతోషంతో పాడిన పాటల్నే గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ పాడతారు. వీటి గొబ్బిపాటలంటారు. పూర్వ కాలం నుంచి జానపదులలో ప్రచారంలో ఉన్న గొబ్బి పాటలే తాళ్లపాక అన్నమాచార్యుల వారి గొబ్బి సంకీర్తనలకు ఆధారమైనాయి.
మన సంస్కృతీ సంప్రదాయలు భోగికి ఎంతో విశిష్టత ఉంది:
భోగ భాగ్యాలను ఇచ్చే పండుగ కనుక ‘భోగి’ అంటాము. ఇది దక్షిణాయాకీ, ధనుర్మాసానికీ చివరి రోజు కావటం విశేషం. భోగిపళ్లు, బొమ్మలకొలువు, భోగిమంటలు ఇలా ఈ రోజు మనం చేసుకునే ప్రతి చర్య వెనుక ఎన్నో సాంప్రదాయ విలువలు దైవీయమైన నేపథ్యం దాగున్నాయి. భోగి పండుగ అంటే సూర్య భగవానుకి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ రోజు సాంయంత్రం సంవత్సరం నుంచి అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పేరంటం చేస్తారు. అంటే రేగు పళ్లను పిల్లవాడి తలపై పోస్తారు. రేగుపండ్లు అంటే భోగిపండ్లు అని అర్థం. రేగు పండుకి సంస్కృతంలో ‘అర్కఫలమ్’ పేరు ఉంది. ‘అర్క’ అంటే సూర్యుడు అర్థం. పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటాకీ, పీడని వారణ కావటాకి, సూర్యురూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్లలను, చెరుకుముక్కలను, నాణేలు( చిల్లర డబ్బులు) బొరుగులను (మరమరాలు) ఒక రాగి చెంబులో కూర్చోబెట్తారు. ముత్తైదువులను పిలిపించి రాగి చెంబులో పళ్లను పిల్లవాడి తలపై పోస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టి లోపాలు తొలగి, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయ విశ్వసిస్తారు. తల నుండి పోస్తున్న ఈ రేగు పళ్లు లాగే సూర్యశక్తి, ఈ పిల్లవానికి శరీరంనిండుగా ఉండాన్నల పెద్దల ఆకాంక్ష దీవెనలన్న మాట. ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులంతా పళ్లు పోస్తూ, పాటలు కూడా పాడుతారు. అందుకే ప్రతి పండుగ వెనుక ఓ అర్థం, పరమార్థం దాగి ఉన్నాయి. ఇవి వేదాలు అందించిన మహా ప్రసాదం, మన సంస్కృతికి ప్రాణం అని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకోవటం ఆనవాయితీ మొదటి రోజు భోగి. రెండోరోజు సంక్రాంతి. మూడో రోజు కనుము. భోగి అనగా చాలా అర్థాలున్నాయి ధనుర్మాసం ఆఖరి రోజు భోగి. ఈ రోజు భోగి మంటలు వేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా కపించే ఆచారం. భోగి రోజున“గోదారంగనాథుల” వివాహాలను వైష్ణవాలయాలలో జరుపుతారు. రేగు పళ్లను తింటూ వ్యాసుల వారు తపస్సు చేశారు. అందుచే ఆయనను బాదరాయణుడంటారు. రేగు పళ్ల లయమే బదరికా శ్రమయింది.
అందుకేనేమో ఈ రోజు రేగు పళ్లను పిల్లల తల మీదుగా పోస్తారేమో.! ఇంట్లో వృథాగా ఉన్న పాత వస్తువులను దారిద్య్రాకి ప్రతీకగా భావించి, ఈ రోజు వాటి తగులబెడ్తారు. తర్వాత శుచిగా మంగళస్నానాలు చేయడం ద్వారా దారిద్య్రం తొలగి అదృష్టలక్ష్మి వరిస్తుంద నమ్మకం. సజ్జలు పండే ప్రాంతంలో వసించే వారు సజ్జ రొట్టెలకు నువ్వులు అంటించిన రొట్టెను తింటారు. సజ్జలు ఉష్ణ్నా కలిగించే స్వభావం కలవి కావున ఈ రోజున సజ్జరొట్టను తింటారు. అదే విధంగా అ్నరకాల కూరగాయల్నంటి కలిపి కూర చేస్తారు.
హరిదాసు:
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు:
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం.“జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం. ఈ విధంగా సిరులు పండే ఈ సంక్రాంతి పండుగలో ‘భోగి’ మనం కూడా ఆచరిద్దాం, మన సంస్కృతి కాపాడుదాం. గాలి పటాలు ఎగుర వేయడం కూడా ఈ పండుగ ప్రత్యేకత.
పలు ప్రాంతాలలో మకర సంక్రాంతి:
మకర సంక్రమణ పర్వదినాన ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అని , తమిళనాడులో పొంగల్ అని(pongal) , బెంగాల్‌లో తిలప్రా సంక్రాంతి అని , పంజాబులో లోహడీ అని , మహారాష్ట్రలో తిల్ సంక్రాంతి అని , వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో వ్యవహరిస్తు ఉన్నప్పటికీ పండుగను ఆచరించుకోవడంలో మూలసూత్రం మాత్రం ఒకటే. అదే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం ఈ పండుగ ముగియగానే పగటి సమయం పెరుగుతుంది. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మూలంగా సంక్రాంతి సంబరాలు కపించని సంస్కృతి నెలకొంది. ముఖ్యంగా బుడబుక్కలవారు, భోగిమంటలు వంటివి నేడు కనుమరుగై పోతున్నాయి.

No comments:
Post a Comment