Tuesday 3 January 2017

Banaganapalli, Andhra Pradesh To Sri Uma Maheswara Temple, Yaganti, Andhra Pradesh 518124

రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. అందమైన మా ప్రయాణం లో మేము చుసిన క్షేత్రాలు –వాటి వివరాలు బనగానపల్లె:- --------------- శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, రవ్వలకొండ ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు. వీర బ్రహ్మేంద్ర స్వామి తన కల జ్ఞానాన్ని రాసిన ప్రదేశాలు ఈ క్షేత్ర సమీపంలోనే ఉన్నాయి . బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకైంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒకావలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆవలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానభోద చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానభోద చేసాడు. యాగంటి:- --------- సృష్టి అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న రంకేలేస్తడు అని వీర బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో వివరించారు . బనగానపల్లె కి 12 కి మీ దూరం దట్టమైన గుహల మద్య ఎంతో రమణీయంగా వెలసిన క్షేత్రం యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవాలయం. ఎంతో అందంగా ఉండే ఈ దేవాలయం లో అందమైన కోనేరు, కొనెరులొ నంది పైనుండి జాలువారే నిటి ప్రవాహం కళ్ళను మహిమరిపించేల చేస్తాయి. ఇద్దరు బక్తుల కోరిక పైన స్వామి వారు ఇక్కడ వెలసారని చెబుతారు . ఆలయ నికి సమీపం లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక గుహలో ఉంది.అగస్త్యమహర్షి స్వామి వారు తపస్సు చేసిన గుహ ఒకటి ఉంది వీరబ్ర్హమేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహ ఇంకోటి ఉంది . ఉమా మహేశ్వర ఆలయా మండపం ల ఉన్న నందీశ్వర స్వామి ఉంటారు . ఉమా మహేశ్వరుడు ఆర్ధనరిశ్వర రూపం లో స్వయం భు లింగం గ ఇక్కడ వెంచేసి ఉన్నాడు . ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు. యాగంటి బసవన్న:- Image result for banaganapalli to yaganti
------------------- ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. బెలూం గుహలు:- Image result for banaganapalli to yaganti-------------------------- బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత . సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుందా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు . గుహల్లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నయి. బెలూం గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. గండి వీరాంజనేయ స్వామి దేవాలయం :- ------------------------------------ “త్రేతా యుగంలో దశరధ నందసుడైన శ్రీ రామ చంద్రమూర్తి తన వనవాసకాలంలో స్వాహాస్తమూలతో తన నిశీత శిలీ ముఖంతో బాణపు కొనతో గిచిన ఆంజనేయ స్వామి నేడు గండి క్షేత్రం” పులివెందుల -రాయచోటి తాలుకాల సరిహద్దులలో పాపాగ్ని నది తీరాన రెండు కొండల నడుమ ఉన్న ఈ క్షేత్రం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . నదిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాల నుంచి విముక్తి లబిస్తుంది అని ప్రతీతి .రావణ వధ అనంతరం శ్రీ రాముడు లోంక నుంచి తిరిగి వస్తు కొంత కాలం ఇక్కడ గడిపడని, ఆ సమయం లోనే తన కోన గోటి తో ఆంజనేయ స్వామని చిత్రించాడని అదీ ఆంజనేయ స్వామి దేవాలయంగా వెలుగొందింది అని స్థల పురాణం చెబుతుంది . త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేసాడు. రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నపుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు. చిత్రం చివరిదశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తుచేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు. ఆచిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజిల్లుతున్నది. ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది. ఇది పురాణం చెబుతున్న విషయం. ప్రొద్దుటూరు:- కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం లోని పినాకిని నది తీరాన గల ప్రసిద్ద క్షేత్రం ముక్తి రామేశ్వరం . ఈ క్షేత్రంలో శ్రీ రాములవారు ప్రతిష్టించిన శివలింగం ఉండటం వలన ఈ ప్రాంతానికి రామేశ్వరమని , మర్జలరుపన గల రావణుని శ్రీ రాముడు బాణాల చేత వాదించి ముక్తి లబించడం వలన ఈ ప్రాంతానికి ముక్తి రామేశ్వరం అని పేరు వచ్చింది అని చెబుతారు . 56 అడుగుల ఎత్తు గల సుందర రూపం గల లింగం ఈ దేవాలయం లో మనకు దర్శనమిస్తుంది . రావణ వధ అనంతరం హత్య దోషనివరణకు రాముడు ఈ ప్రాంతం లోని శివలింగాన్ని ప్రతిస్టించాడు అని చెబుతారు . రాముడు హనుమని కాశి పంపించి లింగాలను తీసుకోని రమ్మనగా సరి సమయం లో రాకపోవడం వలన రాముడే లింగాన్ని తాయారు చేసి ప్రతిష్టించాడట అ లింగాన్ని సైకత లింగం అని అంటారు . ఆ తరువాత హనుమ తీసుకోని వచ్చిన లింగాన్ని సమీపం లో ప్రతిష్టింరట . అందుకే ఈ క్షేత్రాన్ని రామలింగేస్వరం అనియు హనుమాన్ క్షేత్రం అని కూడా పిలుస్తారు . శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం అద్బుతమైన కట్టడాలు ,సుందరమైన గాలి గోపురం, కాలత్మకమైన చిత్రాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఆలయానికి సమీపం లో రాజ రాజేశ్వరి దేవాలయం కూడా ఉంది . జగద్గురు అది శంకరాచార్యులు ఈ దేవాలయం లో శ్రీ చక్ర యంత్రాన్నిప్రతిష్టించాడు. ఆలయ ఆవరణ లో చాల ఉపలయాలు ఉన్నాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించానీయమైన క్షేత్రం ఇది . మహానంది:- ------------------ పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు నంద్యాల నుండి 15 కి మీ దూరం లో ఉన్న ఈ పురాతన క్షేత్రం చాల మహిమన్మితమైనది . నందీశ్వర స్వామి కొలువై ఉన్నాడు . నంద్యాల చుట్ట పక్కల అన్ని కలుపుకొని నవ నందుల దేవాలయు ఉన్నాయి అందుకీ ఈ క్షేత్రాన్ని నంది మండలం అంటారు నవనందులు -------- కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment