Saturday, 21 January 2017

Astrology / Navagrahalu / Sukradasa / Antardasa / శుక్ర మహాదశ,అంతర్దశలు నడుస్తున్నవారైనా మద్యపానానికి దూరముగా ఉండడము శ్రేష్టము

శుక్ర దశ, అంతర్ధశల యందు మద్యం సేవించేవారు శుక్రగ్రహ శాపం వలన నష్టపోతారు

సురాపాన  ప్రియో శుక్రః అంటారు.ఎన్నోవేల సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి సాథించిన మృత సంజీవినీ విద్యను ఆగ ర్భ శత్రువైన గురువు కుమారుడు కచునికి థారపోయవలసి వచ్చింది.దీనికి మూలకారణముశుక్రుని సురాపానమే.అందుకే సురాపాన ప్రియుడైన శుక్రునికి సురాపానము మీద విపరీతమైన అసహ్యము, కోపము ముంచుకొచ్చాయి.కోపముతో మద్యపానప్రియులను శుక్రుడు శపించాడు. మద్యపానము సేవించే వాళ్ళు శుక్రగ్రహ శాపమువల్ల ఏదోవిథముగా నష్టపోతారు.ఇది ఋజువైన సత్యం.

దేవతలకు,రాక్షసులకుఎంతో కాలముగా విరోథాలు,గొడవలు,యుథ్థాలు జరిగినవి. అయితే ఆ క్రమములో జరిగిన యుథ్థాలలోదేవతలు,రాక్షసులు ఇద్దరూ మరణించేవారు.అయితే పరమ శివుని దగ్గర పొందిన మృతసంజీవినీ విద్య వలన రాక్షస గురువైన శుక్రుడు చనిపోయిన రాక్షసులనందరినీ బ్రతికిస్తూ ఉండేవాడు.దీంతో దేవతలకు శుక్రుడు పెనుసవాలుగా పరిణమించాడు.దీని వలన కొంతకాలానికి దేవగణము అంతమయ్యే పరిస్థితి ఏర్పడింది,రాక్షస గణము పెరిగి పోసాగింది.దానితో దేవతలందరూ తమ గురువైన బృహస్పతితో చర్చించి దీనికి ఒక పరిష్కారము కనిపెట్ట వలసినదిగా సూచించారు.అప్పుడు శుక్రుని దగ్గర ఎలాగైనా, ఏ విథముగా నైనా మృత సంజీవినీ విద్యనభ్యసించడానికి ఎవరినీ పంపించాలా అని ఆలోచించగా ఎవరూ ముందుకు రాలేదు.దాంతో బృహస్పతి తన కుమారుడైన కచుని శుక్రాచార్యుని వద్దకు పంపించాడు.

పరమ శత్రువైన బృహస్పతి కుమారునికి ఆశ్రయమిచ్చి కచుని శిష్యుడిగా అంగీకరించాడు. అనేక శాస్త్రాలు భోథించాడు.క్రమముగా కచుని సత్ప్రవర్తన వలన శుక్రునికి ప్రియశిష్యుడిగా మారాడు.శుక్రుని కూతురు దేవయాని కచుని అభిమానించింది.అది క్రమముగా ప్రేమగా మారినది.ఈ విషయాలన్నీ గ్రహించిన రాక్షసులు దీనివలన తమ ఉనికికి భంగము ఏర్పడుతుందని త మ గురువైన శుక్రాచార్యునికి విన్నవించుకున్నారు.ఆవేదన తెలిపారు నిరశించారు అయినా శుక్ర,దేవయానులలో కచునిపట్ల ఎలాంటిమార్పురాలేదు.దీనితో ఆగ్రహము చెందిన రాక్షసులు ఎ ప్పటికైనా కచునివలన తమజాతికి ముప్పుఏర్పడుతుందని అందుకుగానూ అతనిని ఆ ప్రమాద ము జరుగక మునుపే చంపివేయాలని నిర్ణయించుకున్నారు.

ఒకరోజు ఉదయము పూజకు కావ లిసిన సమిథల కోసము అడవికి వెళ్ళగా రాక్షసులు వెంబడించి అతనిని చంపిచెట్టుకు వ్రేలాడదీశారు.మిట్ట మథ్యాహ్నమైన తరువాత కూడా కచుని జాడ తెలియక పోవడముతో దేవయాని తం డ్రికి కచుడు కవిపించని విషయము తెలియచేస్తుంది.దానితో శుక్రుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయం గ్రహించి చెట్టుకు శవమై వ్రేలాడుతున్న కచుణ్ణి తన మృతసంజీవిని విద్యతో భ్రతికిస్తాడు.తమ ప్రయత్నము సఫలము కాని రాక్షసులు ఆగ్రహముతో ఆ తరువాత కచుణ్ణి నయా నా,భయానా తమ గురువునుండి పంపివేయడానికి ఎన్నో ఫథకాలు వేస్తారు.ఏప్రయత్నము సఫలము కాకపోవడముతో కచుణ్ణి అనేక రకములుగా అనేక సార్లు చంపడము,శుక్రుడు తిరిగి బ్రతికించడము ఈ సంఘటనలతో కచ,దేవయానుల మథ్య మరింత ప్రేమ పెరగడము గ్రహించిన రాక్షసులు అందరూ కలిసికట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచిస్తున్నప్పుడు శుక్రుడి బలహీనత ఐన మద్యపానము అలవాటును గ్రహించిన రాక్షసులు కచుణ్ణి వథించి కాల్చి బూడిదచేసి కల్లులో కలిపి అత్యంత వినయముగా,భక్తి పూర్వకముగా శుక్రుడికి ఇస్తారు.

కల్లువాసన చూడగా నే తననుతాను మైమరిచిపోయే శుక్రుడు  బూడిదను కలిపిన సురను సేవిస్తాడు.రోజులు గడిచిన కొద్దీ కనిపించని కచుణ్ణి గురించిన ఆందోళనతో శుక్రుడిని కచుడి ఆచూకీ గురించి నిలదీస్తుంది.

మహనీయుల బలహీనతలు సైతం మానవాళికి కనువిప్పు కలిగించే సంఘటనలు ప్రత్యక్షర సత్యములు.సురాపానము మత్తులో ఉన్నశుక్రుడు కుమార్తె మీద ప్రేమతో తన దివ్య దృష్టితో ముల్లోకాలను వెదుకుతాడు.కానీ ఎక్కడా కచుడి ఆచూకీ కానరాలేదు.చివరకు కచుడు చనిపోయి బూడిదరూపములో తన కడుపులోనే ఉన్న విషయాన్ని గ్రహించిన శుక్రుడు కచుడికి మృత సంజీవనీ విద్యను ఉపదేశించి తన ఉదరము చీల్చుకుని బయటకు రమ్మంటాడు.శుక్రుని ఉదరము చీల్చుకుని బయటకు వచ్చిన కచుడు తిరిగితానునేర్చుకున్న మృతసంజీవనీ విద్యతో తిరిగి శుక్రుడిని బ్రతికిస్తాడు.ఈసంఘటనతో కచుడి గురుభక్తి,శుక్రుడికి ఉన్న శిష్యునిమీద వాత్స ల్యము ప్రపంచమునకు వెలుగులోనికి వచ్చినాయి.జరిగిన సంఘటనలన్నీ పరిశీలించిన శుక్రు డు సురాపానము వలన ఏర్పడిన అనర్థములను గుర్తించి ఇక మీదట ఎవరైనా సురాపానము చేస్తే భ్రష్టు లవుతారనీ,దైవానుగ్రహాన్ని కోల్పోతారనీ శాపమిచ్చాడు.

గమనికః కనీసము శుక్ర మహాదశ,అంతర్దశలు నడుస్తున్నవారైనా  మద్యపానానికి దూరముగా ఉండడము శ్రేష్టము.శ్రేయస్కరము.🌹🌹🌹🌹

Thanks to Vamsi Nemani 

No comments:

Post a Comment