Tuesday 31 January 2017

Hindhu Traditional Marriage

🔔వివాహ సమయంలో అమ్మాయి కొబ్బరిబోండం ఎందుకు పట్టుకోవాలి?🔔
కొబ్బరిబోండంను పూర్ణఫలం అంటాం. అంతే కాకుండా అది పార్వతీపరమేశ్వర స్వరూపంగా భావించి వధువు కొబ్బరిబోండం పట్టుకుని వస్తుంది. పైగా మనకి శాస్త్రం సాలంకృత కన్యాదానం చెయ్యాలి అని, అలా చేసినట్లు అయితేనే కన్యాదాన ఫలితం పూర్తిగా కన్యాదాతకు దక్కుతుంది అని చెబుతోంది. సాలంకృత కన్యాదానం అంటే అమ్మాయి చెవులకు, చేతులకు, మెడకు, నడుముకు, బంగారు ఆభరణాలు పెట్టి కన్యాదానం చెయ్యాలి. అలాగే కన్యాదాత కన్యాదానానికి ముందు దశదానాలు చేసి కన్యాదానం చెయ్యాలి.
మరి కాలమున పరిస్థితులలో వివాహము అంటేనే కన్యాదాతకు చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి బంగారం ధర చూస్తేనేమో కొండెక్కి కూర్చుంది. మరి మధ్య తరగతి కుటుంబీకులకు బంగారం కొనడము కష్టమే. దశదానాలు కూడా మరీ కష్టం. మన శాస్త్రం, ఒక వేళ నీకు బంగారం కొనడం ఇబ్బంది అయినా కొని తీరవలసినదే అని చెప్పదు. దానికి తరుణోపాయం చెబుతుంది. తరించడానికి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత వధువు చేతిలో కొబ్బరిబోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడి కాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే. కొబ్బరిబోండం పార్వతీపరమేశ్వర స్వరూపం కాబట్టి ఆ కొబ్బరిబోండానికి ఎట్టి పరిస్థితులలోను పిన్నులను గుచ్చడం కానీ, లేకపోతే పిచ్చి పిచ్చి అలంకారాలు చెయ్యడం కాన్ని చెయ్యకూడదు.
పూర్తి కన్యాదాన ఫలితం ఈ రకంగా శాస్త్రోక్తంగా చేస్తే దక్కుతుంది. లేనిపోని కొత్త పోకడలకు పోకూడదు.
సర్వేజనా సుఖినోభవంతు

Do not decorate the Coconut used during the Khanyadhanam it is believed as Lord Shiva Maa Parvathi...
Image may contain: 2 peopleNo automatic alt text available. Not to decorate coconutImage may contain: one or more people and foodWhat is natural is near to God

Thank You: Vamsi Nemani garu..

Saturday 21 January 2017

Astrology / Navagrahalu / Sukradasa / Antardasa / శుక్ర మహాదశ,అంతర్దశలు నడుస్తున్నవారైనా మద్యపానానికి దూరముగా ఉండడము శ్రేష్టము

శుక్ర దశ, అంతర్ధశల యందు మద్యం సేవించేవారు శుక్రగ్రహ శాపం వలన నష్టపోతారు

సురాపాన  ప్రియో శుక్రః అంటారు.ఎన్నోవేల సంవత్సరాలు కష్టపడి తపస్సు చేసి సాథించిన మృత సంజీవినీ విద్యను ఆగ ర్భ శత్రువైన గురువు కుమారుడు కచునికి థారపోయవలసి వచ్చింది.దీనికి మూలకారణముశుక్రుని సురాపానమే.అందుకే సురాపాన ప్రియుడైన శుక్రునికి సురాపానము మీద విపరీతమైన అసహ్యము, కోపము ముంచుకొచ్చాయి.కోపముతో మద్యపానప్రియులను శుక్రుడు శపించాడు. మద్యపానము సేవించే వాళ్ళు శుక్రగ్రహ శాపమువల్ల ఏదోవిథముగా నష్టపోతారు.ఇది ఋజువైన సత్యం.

దేవతలకు,రాక్షసులకుఎంతో కాలముగా విరోథాలు,గొడవలు,యుథ్థాలు జరిగినవి. అయితే ఆ క్రమములో జరిగిన యుథ్థాలలోదేవతలు,రాక్షసులు ఇద్దరూ మరణించేవారు.అయితే పరమ శివుని దగ్గర పొందిన మృతసంజీవినీ విద్య వలన రాక్షస గురువైన శుక్రుడు చనిపోయిన రాక్షసులనందరినీ బ్రతికిస్తూ ఉండేవాడు.దీంతో దేవతలకు శుక్రుడు పెనుసవాలుగా పరిణమించాడు.దీని వలన కొంతకాలానికి దేవగణము అంతమయ్యే పరిస్థితి ఏర్పడింది,రాక్షస గణము పెరిగి పోసాగింది.దానితో దేవతలందరూ తమ గురువైన బృహస్పతితో చర్చించి దీనికి ఒక పరిష్కారము కనిపెట్ట వలసినదిగా సూచించారు.అప్పుడు శుక్రుని దగ్గర ఎలాగైనా, ఏ విథముగా నైనా మృత సంజీవినీ విద్యనభ్యసించడానికి ఎవరినీ పంపించాలా అని ఆలోచించగా ఎవరూ ముందుకు రాలేదు.దాంతో బృహస్పతి తన కుమారుడైన కచుని శుక్రాచార్యుని వద్దకు పంపించాడు.

పరమ శత్రువైన బృహస్పతి కుమారునికి ఆశ్రయమిచ్చి కచుని శిష్యుడిగా అంగీకరించాడు. అనేక శాస్త్రాలు భోథించాడు.క్రమముగా కచుని సత్ప్రవర్తన వలన శుక్రునికి ప్రియశిష్యుడిగా మారాడు.శుక్రుని కూతురు దేవయాని కచుని అభిమానించింది.అది క్రమముగా ప్రేమగా మారినది.ఈ విషయాలన్నీ గ్రహించిన రాక్షసులు దీనివలన తమ ఉనికికి భంగము ఏర్పడుతుందని త మ గురువైన శుక్రాచార్యునికి విన్నవించుకున్నారు.ఆవేదన తెలిపారు నిరశించారు అయినా శుక్ర,దేవయానులలో కచునిపట్ల ఎలాంటిమార్పురాలేదు.దీనితో ఆగ్రహము చెందిన రాక్షసులు ఎ ప్పటికైనా కచునివలన తమజాతికి ముప్పుఏర్పడుతుందని అందుకుగానూ అతనిని ఆ ప్రమాద ము జరుగక మునుపే చంపివేయాలని నిర్ణయించుకున్నారు.

ఒకరోజు ఉదయము పూజకు కావ లిసిన సమిథల కోసము అడవికి వెళ్ళగా రాక్షసులు వెంబడించి అతనిని చంపిచెట్టుకు వ్రేలాడదీశారు.మిట్ట మథ్యాహ్నమైన తరువాత కూడా కచుని జాడ తెలియక పోవడముతో దేవయాని తం డ్రికి కచుడు కవిపించని విషయము తెలియచేస్తుంది.దానితో శుక్రుడు తన దివ్యదృష్టితో జరిగిన విషయం గ్రహించి చెట్టుకు శవమై వ్రేలాడుతున్న కచుణ్ణి తన మృతసంజీవిని విద్యతో భ్రతికిస్తాడు.తమ ప్రయత్నము సఫలము కాని రాక్షసులు ఆగ్రహముతో ఆ తరువాత కచుణ్ణి నయా నా,భయానా తమ గురువునుండి పంపివేయడానికి ఎన్నో ఫథకాలు వేస్తారు.ఏప్రయత్నము సఫలము కాకపోవడముతో కచుణ్ణి అనేక రకములుగా అనేక సార్లు చంపడము,శుక్రుడు తిరిగి బ్రతికించడము ఈ సంఘటనలతో కచ,దేవయానుల మథ్య మరింత ప్రేమ పెరగడము గ్రహించిన రాక్షసులు అందరూ కలిసికట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచిస్తున్నప్పుడు శుక్రుడి బలహీనత ఐన మద్యపానము అలవాటును గ్రహించిన రాక్షసులు కచుణ్ణి వథించి కాల్చి బూడిదచేసి కల్లులో కలిపి అత్యంత వినయముగా,భక్తి పూర్వకముగా శుక్రుడికి ఇస్తారు.

కల్లువాసన చూడగా నే తననుతాను మైమరిచిపోయే శుక్రుడు  బూడిదను కలిపిన సురను సేవిస్తాడు.రోజులు గడిచిన కొద్దీ కనిపించని కచుణ్ణి గురించిన ఆందోళనతో శుక్రుడిని కచుడి ఆచూకీ గురించి నిలదీస్తుంది.

మహనీయుల బలహీనతలు సైతం మానవాళికి కనువిప్పు కలిగించే సంఘటనలు ప్రత్యక్షర సత్యములు.సురాపానము మత్తులో ఉన్నశుక్రుడు కుమార్తె మీద ప్రేమతో తన దివ్య దృష్టితో ముల్లోకాలను వెదుకుతాడు.కానీ ఎక్కడా కచుడి ఆచూకీ కానరాలేదు.చివరకు కచుడు చనిపోయి బూడిదరూపములో తన కడుపులోనే ఉన్న విషయాన్ని గ్రహించిన శుక్రుడు కచుడికి మృత సంజీవనీ విద్యను ఉపదేశించి తన ఉదరము చీల్చుకుని బయటకు రమ్మంటాడు.శుక్రుని ఉదరము చీల్చుకుని బయటకు వచ్చిన కచుడు తిరిగితానునేర్చుకున్న మృతసంజీవనీ విద్యతో తిరిగి శుక్రుడిని బ్రతికిస్తాడు.ఈసంఘటనతో కచుడి గురుభక్తి,శుక్రుడికి ఉన్న శిష్యునిమీద వాత్స ల్యము ప్రపంచమునకు వెలుగులోనికి వచ్చినాయి.జరిగిన సంఘటనలన్నీ పరిశీలించిన శుక్రు డు సురాపానము వలన ఏర్పడిన అనర్థములను గుర్తించి ఇక మీదట ఎవరైనా సురాపానము చేస్తే భ్రష్టు లవుతారనీ,దైవానుగ్రహాన్ని కోల్పోతారనీ శాపమిచ్చాడు.

గమనికః కనీసము శుక్ర మహాదశ,అంతర్దశలు నడుస్తున్నవారైనా  మద్యపానానికి దూరముగా ఉండడము శ్రేష్టము.శ్రేయస్కరము.🌹🌹🌹🌹

Thanks to Vamsi Nemani 

Friday 20 January 2017

ఇంట్లో ఎలాంటి లక్ష్మీ దేవి ఫోటోలు ఉంటే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?/ Lakshmi Pooja

ఇంట్లో ఎలాంటి లక్ష్మీ దేవి ఫోటోలు ఉంటే అష్టఐశ్వర్యాలు పొందుతారు..?
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
గుడ్లగూబ తెలుసుగా. దానిపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే ఫోటోను కానీ, లేదా విగ్రహాన్ని కానీ పూజించకూడదట. దీంతో అంతా అశుభమే జరుగుతుందట. ధనం వచ్చింది వచ్చినట్టు ఖర్చు అవుతుందట.

తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటోను ఇంట్లో ఎట్టిపరిస్థితిలో పెట్టుకోకూడదు. తామర పువ్వులో కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది. అష్టఐశ్వర్యం సిద్ధిస్తుందట.

గరుత్మంతునిపై విష్ణువుతో పాటు లక్ష్మీ దేవి కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా మిక్కిలిగా ధనం లభిస్తుందట. అంతా మంచే జరుగుతుంది.

శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా, ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న ఫోటోను లేదా విగ్రహాన్ని పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట.

లక్ష్మీదేవికి అనుగ్రహం పొందిన కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ దేవి సంతృప్తి చెంది ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట.

పాదరసంతో తయారు చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని పూజిస్తే అన్నీ శుభాలే కలుగుతాయట. ధనం కూడా బాగా సమకూరుతుందట.

శ్రీయంత్రం గురించి తెలియని వారుండరు. ఇంట్లో ఎలాంటి కష్టనష్టాలు జరగకుండా, ధన ధాన్యంతో సంవ్రుద్దిగా ఉండాలని, ఇంట్లో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని మనీ లాకర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.

లక్ష్మీ పూజ చేసేటప్పుడు విష్ణువుకు ప్రీతికరమైన తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పువ్వులను ఎక్కువగా వాడి పూజ చేయాలట. దీంతో అనుకున్నది నెరవేరుతుందట.

దీపావళి రోజున లక్ష్మీ దేవితో పాటు, కుబేరున్ని పూజించి తర్వాత ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇలా మంత్ర జపం చేయడం వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుందట.

ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా🌹🌹🌹🌹

Thanks to

Sunday 15 January 2017

దిక్కులు దిశలు అధిపతులు / Vaastu ....

దిక్కులు దిశలు అధిపతులు

మనకు తెలిసిన ముఖ్యమైన నాలుగు దిశలు తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణం. ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి మరియు వాయవ్య దిశలను విదిక్కులు అంటాము.

సూర్యునికి అభిముఖంగా తిరిగి సూర్యోదయ దిశగా ఉంటె ఆ దిశను తూర్పు అంటారు. అలా ఉండగా మన ఎడమ వైపు గల దిక్కును ఉత్తర దిశ అంటారు.

కుడివైపుకు ఉన్న దిక్కును దక్షిణము అని మరియు వెనక వైపు ఉన్న దిక్కును పడమర దిశగా పరిగణిస్తారు.

తూర్పుకు ఉత్తరానికి మధ్యన కల దిక్కును ఈశాన్యం అంటారు.

తూర్పుకు దక్షిణానికి మధ్యన కల దిక్కును ఆగ్నేయం అంటారు.

పడమరకు ఉత్తరానికి మధ్యగల దిక్కును వాయవ్యం అని అంటారు.

పడమరకు దక్షిణానికి మధ్య గల దిక్కును నైరుతి అని అంటారు.

ఇప్పుడు మనం వివిధ దిక్కులకు ఎవరెవరు అధిపతి అనే విషయాన్ని చూద్దాం.

తూర్పు దిక్కు    – అధిపతి ఇంద్రుడు

ఆగ్నేయ దిక్కు   – అధిపతి అగ్ని దేవుడు

దక్షిణ దిక్కు      – అధిపతి యముడు

నైరుతి దిక్కు     – అధిపతి నిరృతి

పడమర దిక్కు  – అధిపతి వరుణుడు

వాయవ్య దిక్కు – అధిపతి వాయువు

ఉత్తర దిక్కు      – అధిపతి కుబేరుడు

ఈశాన్య దిక్కు   – అధిపతి ఈశానుడు

తూర్పుముఖ ద్వారము ఉండడం వలన పుత్ర సంతానము, కీర్తి ప్రతిష్టలు, గౌరవము మరియు మర్యాదలు కలుగును. ఇంట్లో తూర్పు దిక్కులో బరువులు ఉండడం అశుభం. కావున ఆ దిశలో బరువులు లేకుండా చూడాలి.

ఆగ్నేయమున అగ్నిదేవుడు  ఆహారము, దీర్గాయువు, ఆరోగ్యము లకు అధిపతియై ఉండడం చేత వంట, ఇంటి విద్యుత్ మెయిన్ బోర్డులు ఈ దిశగా ఉండడం సర్వ విధాలా శుభకరం. ఆగ్నేయం మూల బరువులు ఉండడం చేత అగ్ని భయాలు ప్రమాదాలు కలుగును కావున ఆగ్నేయ దిశగా బరువులు ఉంచరాదు.

దక్షిణ దిశకు యముడుఅధిపతి. యముడు న్యాయానికి సత్యానికి అధిపతిగా ఉండటం చేత అటువైపు తల పెట్టుకుని నిద్రించడం చేత ఆ ఇంటిలో నివసించేవారికి మంచి నడవడి, యోగ్యులైన మిత్రులు మరియు నిజాయితీ కలుగుతాయి. దక్షిణ దిశగా ఇంట్లో బరువు ఉండడం శుభం.

నైరుతికి రక్షకుడు నిరృతి కావడం చేత ఆ ఇంటి యజమాని ఆ దిక్కున ఉండడం శ్రేయస్కరం. ఇంట్లో బరువైన వస్తు సామాగ్రిని ఈ దిశగా ఉంచడం మంచిది.

నైరుతి దిశగా ఇంట్లో ఖాళీ స్థలం ఉండరాదు. ద్వారాలు మరియు బయట గేట్ కూడా ఈ దిశగా ఉండరాదు. నైరుతి దిశగా ఇంట్లో బరువు ఉండడం చేత శుభం మరియు ఆ ఇంటికి శత్రు భయం కూడా ఉండదు.

పడమర దిశకు అధిపతి వరుణుడు కావడం చేత ఇంట్లో స్త్రీ సంతాన వృద్ధి మరియు ఐశ్వర్య ప్రాప్తి కలుగును. ఈ దిశగా జీవించేవారు సాధారణంగా ఆధిపత్య స్థానాలలో ఉంటారు మరియు మిక్కిలి తెలివైనవారుగా ఉంటారు. ఇంట్లో ఈ దిక్కులో గేట్ లేదా మెట్లు ఉండడం శుభకరం. పడమర దిశలో ఇంట్లో బరువు ఉండడం చేత ఆ ఇంట్లో పశుగణాభివృద్ధి జరుగును.

వాయవ్య దిశకు అధిపతి వాయుదేవుడు. వాయుదేవుడు ఇంటి యజమానికి మంచి ఆలోచన మరియు మంచి కుటుంబాన్ని ఇస్తాడు. వాయవ్య దిశగా గేట్ ఉండకూడదు. వాయవ్య దిశలో ఇంట్లో బరువులు లేకపోతె ఇంట్లోనివారికి మంచి వర్తన, స్థిరత్వం కలుగుతుంది.

ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు ఐశ్వర్య కారకుడు. ఉత్తర దిశగా జీవించేవారికి మంచి విద్య మరియు సంపద కలుగును. వీరు చాలా తెలివైనవారు మరియు ఉన్నత పదవులను చేపట్టేవారు అవుతారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉత్తర దిశ దర్శించుకోవడం శుభకరం. ఇంట్లో ఉత్తరం మూల బరువులు లేకపోవడం వలన ధనధాన్యాభివృద్ధి కలుగును.

ఈశాన్య దిశలో నివసించేవారు కార్య దీక్ష గలవారు మరియు విజయాలను సాధించేవారు అవుతారు. ఈ దిక్కు అన్ని దిక్కులలోకెల్లా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చును. అందుచేతనే ఇంట్లో ఈశాన్య దిశగా పూజా మందిరాన్ని ఉంచి పూజలు చేస్తారు. ఇంట్లో ఈశాన్యం మూల బరువులు లేకపోవడం సర్వ శుభకరం.🌹🌹🌹🌹

Friday 13 January 2017

Importance of Pongal/Sankranti (Bhoggi/Sankranti/Kanuna)

భోగి పండుగ యొక్క విశిష్టతలు (pongal)

మన తెలుగు వారి పెద్ద పండుగ(pongal) మొదటి రోజున వచ్చే భోగి పండుగ యొక్క విశిష్టతలు:

భోగి : మూడు రోజుల పాటు జరిగే పండుగలో మొదటి రోజు భోగి పండుగ. ‘భోగి’ అనే పదానికి ‘తొలినాడు’ అనే అర్థం ఉన్నది. అనగా పండుగ తొలినాడు అని అర్థం. భోగి రోజున ఇంటి ముందర మంట వేయడం వలన ఇంటిలో ఉండే దారిద్య దేవతను తరిమినట్లు హిందువుల విశ్వాశం. భోగికి ముందు రోజున ఇంటిలో ఉండే పనికిరాని పాత వస్తువులని వేరి ఇంటిని శుభ్రపరచి భోగి రోజున ఇంటిముందు తెల్లవారుఝామున మంటలు వేయడం దక్షణ భారతీయుల అలవాటు . తాటి మట్టలు మరయు ఎండిన చెట్టు కొమ్మలుతో పెద్ద పెద్ద మంటలు వేయడం ఆంధ్ర వారి అలవాటు.

భోగి రోజు ముఖ్యంగా చేసే విధులు :

భోగి మంటలు, భోగి పళ్లు పోయడం, బొమ్మల కొలువు మొదలగునవి చేస్తారు. ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెడతారు.

గొబ్బెమ్మలు: మన తెలుగు వారి హిందూ సంప్రదాయంలో ‘గొబ్బి‘ గోపి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. గొబ్బెమ్మ అంటే ‘నమస్కారాల దేవత’మరియు ‘లోకజనని’ అనే బిరుదులున్నాయి. ఈ గొబ్బెమ్మ సాక్షాత్తూ గౌరీ స్వరూపమే. జానపదులు కూడా శక్తి స్వరూపిణియైన కాత్యాయనే గొబ్బెమ్మగా భావిస్తారు. ఈ నెలలో చలి అత్యధికంగా ఉంటుంది.

కాబట్టి అనేక సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభిస్తాయి అందువలన మన పెద్దలు మనకు ఎలాంటి విష జ్వరాలు ఎలాంటి అంటురోగం మన దగ్గరకు రాకుండా ఈ గొబ్బెమ్మలు పెట్టమని చెప్పారు . గోమయానికీ, గోమూత్రానికీ ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తి వుంటుంది. తేళ్లు, జెర్రులు వంటివి ఇంట్లోకి రావు. నీటిలో ఆవుపేడకలిపి ఇంటి ముందు జల్లుతారు. గొబ్బిళ్లపై చల్లే పసుపు కుంకుమకు క్రిములను హరించే గుణం వుంది. అసలు గొబ్బమ్మలు పెట్టడం ఈ సంక్రాంతి పండుగ యొక్క మరో విశిష్టత ఏమంటే ఆవుపేడను చిన్న చిన్న ముద్దలుగా చేసి, వాటిలో పసుపు, కుంకుమలతో అలంకరించడంతో పాటు వాటి మధ్యలో గరిక (గడ్డి), రేగుపళ్లు, నువ్వులు, పూలు పెడుతారు .. కొన్ని ప్రాంతాలవారు వాటి మధ్యలో నవధాన్యాలను ఉంచుతారు. ‘గొబ్బి’ గోపి అనే సంస్కృత పదం నుంచి పుట్టింది. గోపికలు కృష్ణు చుట్టూ చేరి సంతోషంతో పాడిన పాటల్నే గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ పాడతారు. వీటి గొబ్బిపాటలంటారు. పూర్వ కాలం నుంచి జానపదులలో ప్రచారంలో ఉన్న గొబ్బి పాటలే తాళ్లపాక అన్నమాచార్యుల వారి గొబ్బి సంకీర్తనలకు ఆధారమైనాయి.

మన సంస్కృతీ సంప్రదాయలు భోగికి ఎంతో విశిష్టత ఉంది:

భోగ భాగ్యాలను ఇచ్చే పండుగ కనుక ‘భోగి’ అంటాము. ఇది దక్షిణాయాకీ, ధనుర్మాసానికీ చివరి రోజు కావటం విశేషం. భోగిపళ్లు, బొమ్మలకొలువు, భోగిమంటలు ఇలా ఈ రోజు మనం చేసుకునే ప్రతి చర్య వెనుక ఎన్నో సాంప్రదాయ విలువలు దైవీయమైన నేపథ్యం దాగున్నాయి. భోగి పండుగ అంటే సూర్య భగవానుకి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ రోజు సాంయంత్రం సంవత్సరం నుంచి అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పేరంటం చేస్తారు. అంటే రేగు పళ్లను పిల్లవాడి తలపై పోస్తారు. రేగుపండ్లు అంటే భోగిపండ్లు అని అర్థం. రేగు పండుకి సంస్కృతంలో ‘అర్కఫలమ్‌’ పేరు ఉంది. ‘అర్క’ అంటే సూర్యుడు అర్థం. పిల్లలకు దిష్టి తగలకుండా ఉండటాకీ, పీడని వారణ కావటాకి, సూర్యురూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్లలను, చెరుకుముక్కలను, నాణేలు( చిల్లర డబ్బులు) బొరుగులను (మరమరాలు) ఒక రాగి చెంబులో కూర్చోబెట్తారు. ముత్తైదువులను పిలిపించి రాగి చెంబులో పళ్లను పిల్లవాడి తలపై పోస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు దృష్టి లోపాలు తొలగి, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయ విశ్వసిస్తారు. తల నుండి పోస్తున్న ఈ రేగు పళ్లు లాగే సూర్యశక్తి, ఈ పిల్లవానికి శరీరంనిండుగా ఉండాన్నల పెద్దల ఆకాంక్ష దీవెనలన్న మాట. ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులంతా పళ్లు పోస్తూ, పాటలు కూడా పాడుతారు. అందుకే ప్రతి పండుగ వెనుక ఓ అర్థం, పరమార్థం దాగి ఉన్నాయి. ఇవి వేదాలు అందించిన మహా ప్రసాదం, మన సంస్కృతికి ప్రాణం అని చెప్పవచ్చు. సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకోవటం ఆనవాయితీ మొదటి రోజు భోగి. రెండోరోజు సంక్రాంతి. మూడో రోజు కనుము. భోగి అనగా చాలా అర్థాలున్నాయి ధనుర్మాసం ఆఖరి రోజు భోగి. ఈ రోజు భోగి మంటలు వేయడం కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా కపించే ఆచారం. భోగి రోజున“గోదారంగనాథుల” వివాహాలను వైష్ణవాలయాలలో జరుపుతారు. రేగు పళ్లను తింటూ వ్యాసుల వారు తపస్సు చేశారు. అందుచే ఆయనను బాదరాయణుడంటారు. రేగు పళ్ల లయమే బదరికా శ్రమయింది.

అందుకేనేమో ఈ రోజు రేగు పళ్లను పిల్లల తల మీదుగా పోస్తారేమో.! ఇంట్లో వృథాగా ఉన్న పాత వస్తువులను దారిద్య్రాకి ప్రతీకగా భావించి, ఈ రోజు వాటి తగులబెడ్తారు. తర్వాత శుచిగా మంగళస్నానాలు చేయడం ద్వారా దారిద్య్రం తొలగి అదృష్టలక్ష్మి వరిస్తుంద నమ్మకం. సజ్జలు పండే ప్రాంతంలో వసించే వారు సజ్జ రొట్టెలకు నువ్వులు అంటించిన రొట్టెను తింటారు. సజ్జలు ఉష్ణ్నా కలిగించే స్వభావం కలవి కావున ఈ రోజున సజ్జరొట్టను తింటారు. అదే విధంగా అ్నరకాల కూరగాయల్నంటి కలిపి కూర చేస్తారు.

హరిదాసు:

గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.

గంగిరెద్దు:

ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం.“జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మబద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం. ఈ విధంగా సిరులు పండే ఈ సంక్రాంతి పండుగలో ‘భోగి’ మనం కూడా ఆచరిద్దాం, మన సంస్కృతి కాపాడుదాం. గాలి పటాలు ఎగుర వేయడం కూడా ఈ పండుగ ప్రత్యేకత.

పలు ప్రాంతాలలో మకర సంక్రాంతి:

మకర సంక్రమణ పర్వదినాన ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి అని , తమిళనాడులో పొంగల్‌ అని(pongal) , బెంగాల్‌లో తిలప్రా సంక్రాంతి అని , పంజాబులో లోహడీ అని , మహారాష్ట్రలో తిల్‌ సంక్రాంతి అని , వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో వ్యవహరిస్తు ఉన్నప్పటికీ పండుగను ఆచరించుకోవడంలో మూలసూత్రం మాత్రం ఒకటే. అదే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడం ఈ పండుగ ముగియగానే పగటి సమయం పెరుగుతుంది. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మూలంగా సంక్రాంతి సంబరాలు కపించని సంస్కృతి నెలకొంది. ముఖ్యంగా బుడబుక్కలవారు, భోగిమంటలు వంటివి నేడు కనుమరుగై పోతున్నాయి.

Thursday 12 January 2017

Muggu endhuku veyali/ eppudu endhuku elaa veyali/ paint tho Muggu veyavocha. Importance of Rangoli in Hindhu tradition....


ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?
మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

Wednesday 11 January 2017

Surya Namaskaram / Healthly Practice/ Health Tips/ SuryaNamaskaram Benefits...

మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా సరే ఉదయం 8 గంటల లోపు కొద్దిగా నీరు సమర్పిస్తే చాలు
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

మనకి ఆరోగ్య,డబ్బు సమస్యలు,మానసిక చికాకులు దాంపత్య సమస్యలు ఇలాగా చెప్పుకుంటూ పోతే మనిషికి చాలా సమస్యలు ఉంటాయి మరి వీటికి కారణం ఏమిటి అని అడిగితే దాదాపు 90% మన గ్రహదోషమే అలాగే కొంతమందికి కొన్ని కోరికలు జీవిత లక్ష్యాలు ఉంటాయి  ఇంకా ఎన్నో సమస్యలకి పరిష్కారం ఇప్పుడు ఇక్కడ మీరు తెలుసుకోగలరు

మన గ్రహలాన్నిటికి అధిపతి సూర్య భగవానుడు అంటే సూర్యుడిని పూజిస్తే సకల గ్రహ దోషాలు నుండి విముక్తి రావడమే కాకుండా  ఆరోగ్యం,ఐశ్వర్యం,మానసిక ప్రశంతాత వస్తాయి ఇంతకి ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి?

ఎలాగా పూజించాలి?

ప్రతిరోజు స్నానం చేసిన తరువాత దోసిళ్ళ నిండ( రెండు అరచేతుల నిండా) నీరు తీసుకుని సూర్యుడి ముందు అంటే తూర్పు వైపు సూర్యుడు మనకి కనపడుతూ ఉండాలి అలాగా నుంచొని నీరుని “ఓం మిత్రాయా నమః” అని మూడు సార్లు చెపుతూ మూడు సార్లు నీళ్ళు వదిలి పెడితే ఇంకా మీకు ఎలాంటి సమస్య అయిన లేదు ఎలాంటి గ్రహదోషం ఐన మరియు ఎలాంటి కోరికలైన ఖచ్చితంగా తీరుతాయి.

ఎప్పుడు పూజించాలి

సూర్యుడికి పూజా స్నానం చేసాక 8 గంటల లోపు చాలా శుభ్రమైన నీటిని మాత్రమే సూర్య భగవానుడికి సమర్పించాలి.అలాగే నీరు వదిలాక ఎండలో ఒక నిమిషం లేదా కొద్దిసేపు నుంచొని నమస్కారం చేసుకోవాలి.

ఇలాగ చేస్తే ఆ రోజు పూజ పూర్తీ అయినట్టే.🌹🌹🌹🌹

Sunday 8 January 2017

ఏ వ్రేలుకు ఏ ఉంగరము ధరిచాలి ? Jyothisyam Astrology Rings /Sastram Science Fingers

ఏ వ్రేలుకు ఏ ఉంగరము ధరిచాలి ?
చూపుడు వేలు
చూపుడు వేలు బృహస్పతి కి ప్రామాణికము పుష్యరాగము, మూన్ స్టోన్ మరియు పగడము కూడా ధరించ వచ్చు. శ్వాస వ్యవస్థకు, పొట్టకు(కడుపు) సంబదిత విషయములకు.
మధ్యవ్రేలు
మద్య వేలుకు శని కి ప్రామాణికము నీలం,మూన్ స్టోన్, పిల్లికన్ను రాయి కూడా ధరించ వచ్చు, కాలేయము మరియు ప్రేగులు సంబందిత విషయములకు.
ఉంగరపు వ్రేలు
ఉంగరపు వ్రేలు రవికి ప్రామాణికము కెంపు,పగడం, నీలం మరియు మూన్ స్టోన్ ధరించ వచ్చు,రక్త ప్రసరణ, మూత్ర పిండాలకు సంబందిత విషయములకు.
చిటికిన వ్రేలు
చిటికిన వేలుకు భుదుడు కి ప్రామాణికము ఈ వేలుకు ఆకుపచ్చ పచ్చ, ఎమరాల్డ్ గ్రీన్, ధరించవచ్చు, కాళ్లు, మానముసంబందిత విషయములకు.🌹🌹🌹🌹

 లగ్నం

జ్యోతిష శాస్త్రంలో లగ్నం ప్రధాన మైనది. లగ్నం శిశువు పుట్టిన సమయాన్ని అధారంగా చేసుకుని నిర్ణయించ బడుతుంది. ఒక రాత్రి ఒక పగటి సమయంలో మొత్తం పన్నెండు లగ్నాలు ఆవృత్తం ఔతాయి. సాధారణంగా సూర్యుడు మేషరాశి ప్రవేశ కాలం అయిన మేష సంక్రాంతి నుండి ఉదయకాలమున మేష లగ్నంతో ప్రారంభం ఔతాయి. ఒక లగ్న కాలం రెండున్నర ఘడియలు. ప్రస్తుత కాలంలో రెండు గంటల సమయం. అంటే నూట ఇరవై నిముషాలు. ఒక రోజు అనగా సూర్యోదయము మొదలు మరల సూర్యోదయము వరకు గల కాలము. ఒక రోజుకు 24 గంటలు లేదా 60 ఘడియలు. ఒక్కోరోజుకు ఈ లగ్నం నాలుగు నిముషాలు వెనుకకు జరిగి తిరిగి ఒక మాస కాలానికి వృషభ సంక్రాంతి నాటికి వృషభ లగ్నంతో మొదలౌతుంది. దానికి కారణము ప్రతి దేశ అక్షాంశముల సహాయముతో మేషాది సాయన లగ్న ప్రమాణములు తెలుసుకొనవచ్చును. ఈ సాయన లగ్న ప్రమాణములు యెన్ని యుగములు అయిననూ ఏ విదమైన మార్పు చెందవు. ఒక భూప్రదిక్షిణ కాలానికి పన్నెండు లగ్నాల ఆవృత్తం పూర్తి ఔతుంది. పన్నెండు లగ్నాలకు పన్నెండు రాశులు అధిపత్యం వహిస్తాయి. ఒక రోజు 12 రాశులు లేదా లగ్నములు వలన యేర్పడినది. అందువలన ఒక రోజునకు 24 గంటలు లేదా 60 ఘడియలు లేదా 12 లగ్నములు అని భావించ వలయును. ఒక రోజులో 12 లగ్నములును ఒకే ప్రమాణము కలిగి వుండవు. కానీ ఈ 12 లగ్నములు ప్రమాణము మొత్తము కలసిన 60 ఘడియలు లేదా 24 గంటలు ఔతుంది. సాధారణంగా లగ్నం నుండి వ్యక్తి జాతక గణన జరుగుతుంది. లగ్నం నుండి పన్నెండు స్థానములకు లేక భావములకు పన్నెండు కారకత్వములు ఉంటాయి. లగ్నం మొదటి(తను) స్థానం లగ్నాధిపతి, అందు ఉండే గ్రహాలను అనుసరించి వ్యక్తి గుణగణాలను గణిస్తారు. రెండవ(ధన) స్థానముకు ధనస్థానం, మూడవది(భ్రాతృ) సోదర స్థానం. నాలుగవ(మాతృ) స్థానం గృహం, సుఖం, తల్లి స్థితిని తెలుపుతుంది. అయిదవ(పుత్ర) స్థానం పూర్వపుణ్య స్థానం. ఆరవ(శత్రు) స్థానం శత్రువులు, రోగముల స్థానం. ఏడవ(కళత్ర) స్థానం. ఎనిమిదవ(ఆయువు) స్థానం మారక స్థానం. తొమ్మిదవ(భాగ్య) స్థానం తండ్రి పితరులు, పిత్రార్జితం సూచిస్తుంది. పదవ(రాజ్య) స్థానం కర్మస్థానం ఇది వ్యక్తి చేయు వృత్తిని సూచిస్తుంది. పదకొండు(లాభ) స్థానం. పన్నెండవ(వ్యయ) స్థానం.

లగ్నం కొన్ని విశేషాలు
లగ్నం నుండి 1,5,9 కోణస్థానములు 5, 9 స్థానములను త్రికోణ స్థానములని అంటాౠ.
లగ్నం నుండి 1, 4, 7, 10 స్థానములు కేంద్ర స్థానములు. వీటిని కంటక స్థానములు, చతుష్టయములు అంటారు. కేంద్రములో ఉన్న గ్రహములు బలమైనవి. లగ్నంలో ఉన్న గ్రహం కంటే 4 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైనది 4 షానంలో ఉన్న గ్రహం కంటే 7 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది. 7 వ స్థానంలో ఉన్న గ్రహం కంటే 10 వ స్థానంలో ఉన్న గ్రహం బలమైంది.
చంద్రుడి నుండి 3, 6, 10, 11 స్థానాలు ఉపజయ స్థానాలు. 1,2,4,5,7,8,9,12 స్థానములు అనుపజయ స్థానములు.
లగ్నము కంటే పంచమ స్థానం పంచమ స్థానం కంటే నవమ స్థానం బలమైనది.
2, 5, 8, 11 స్థానములు పణపర స్థానములు. ఇవి పూర్వ జన్మలో చేసిన పుణ్యకార్యములు తెలియజేస్తాయి.
3, 6, 9, 12 స్థానములు అపోక్లిమ స్థానములు. ఇవి విచక్షణ, హేతు బుద్ధిని తెలియజేస్తుంది.
6, 8, 12 స్థానములు మరుగు స్థానములు దుస్థానములు.
3, 6, 12 స్థానాధిపతులు త్రిషడాయన స్థానములు అంటారు. వీటి అధిపతులు శుభగ్రహాలే అయినా అశుభమే చేస్తారు.
1, 2, 4, 5, 7, 9, 10, 11 శుభ స్థానములు. ఈ ష్తానములో ఉన్న గ్రహాలు శుభఫలితాలు ఇస్తాడు. ఈ స్థానాధి పతులు శుభం కలిగిస్తారు.
2, 7, 11 స్థానములు మారక స్థానములు.
3, 6, 8, 12 స్థానములు పాప స్థానములు. ఈ స్థానములో ఉన్న గ్రహములు గ్రహాధిపతులు శుభాన్ని కలిగిస్తారు.
ఉపజయ స్థానములో ఉన్న పాపగ్రహములు కూడా శుభఫలితాలు ఇస్తాయి.
భావాలు కారకత్వాలు
లగ్నం :- లగ్నం తనూభావాన్ని సూచిస్తుంది. శరీరం, రూపము, వర్ణము, జ్ఞానము, బలాబలాలు, స్వభావం, సుఖదుఃఖాలు మొదలైన వివరాలు తనూభావం నుండి తెలుసుకోవచ్చని పరాశరుని శ్లోకం వివరిస్తుంది. ఉత్తరకాలామృతం దేహమూ, కాళ్ళు, చేతులూ , అవయవములు, సుఖదుఃఖములు, ముసలితనం, జ్ఞానం, జన్మభూమి, కీర్తి, స్వప్నము, బలము, ఆకారము లగ్నం వివరిస్తుందని చెప్తుంది.
ద్వితీయ భావం :- ఇది ధన భావం, కుటుంబ భావంగా భావించబడుతుంది. ధనార్జన , ఆహారం స్వీకరించుట, కంఠ ద్వని, మాట తీరు, కంఠ వ్యాధులు, నాలుక. ముఖము, జీవనం, ఉపన్యాసం, వాక్కు, వాగ్ధాటి, విద్య. ఐశ్వర్యము, ఆభరణములు, భోగము, దుస్తులు, ఆచారం, దాతృత్వం, వజ్రము, మారకము, మణులు, ధనధాన్యము, వ్యాపారం. నాసిక, సుగంధ ద్రవ్యములు, నివయము, కోమలత్వం. కుటుంబం, పాండిత్యం, స్నేహం, స్నేహితులు, స్థిరభావం.
త్రీతీయ భావం :- ఇది పరాక్రమ భావం మరియు కనిష్ఠ సోదర భావంగా భావించ బడుతుంది. తమ్ముళ్ళు, ధైర్య సాహసాలు, కార్య భారం వహించుట, రౌద్రము, కనిష్ట సోదరులు, ఆభరణములు, సత్ప్రవర్తన, వర్ణాశ్రమ ధర్మం, పెద్దలు, యుద్ధము, గురువులు, చెవులు, వాహన సౌక్యము, కాళ్ళు, శారీరక బలం, చిత్త చాంచల్యం, మృష్టాన్న భోజనం, సామర్ధ్యం, శారీరక పుష్టి, సర్వసౌఖ్యము, సంపన్న జన్మ, స్వల్ప ప్రయాణములు, సామర్ధ్యము, కోపము, లాభము, శాంతం, దాసదాసీలు, కార్య సంధానం మొదలైనవాటికి కారకత్వం వహిస్తాడు.
చతుర్ధభావం మాతృభావం. తల్లి సౌఖ్యం, వాహనం, సుఖం గురించి తెలియజేయును. అనేక విధ వాహన సంపద, కష్టార్జితం, శీలము, తల్లి బంధువులు, భూమి, గృహములు, చెరువులు, నూతులు, సాధన మొదలైనవి తెలియజేయును.
పంచమ భావమనే సంతాన భావము. మంత్ర స్థాన, పూర్వపుణ్య స్థానం, బుద్ధి స్థానం కూడా ఔతుంది. వ్యాపారము, బుద్ధిబలం, వివేకము, ఉన్నత విద్య, సంతానం, పితృధనం, సత్కథా పఠనం, వినయము, గౌరవం, స్త్రీ మూలక భాగ్యము, అన్నప్రధానం, మంత్రోపాసన, మంత్ర జపం,పాప పుణ్యములు, గ్రంధరచన, వార్తాలేఖనం, ఆలోచన, వంశపారంపర్య అధికారం, సంతృప్తి, తండ్రి చేసిన పుణ్యము, మనసు, ఛత్రము, గర్భము, శుభలేఖలు, కోరికలు సిద్దించుట, దూరదృష్టి, రహస్యము, క్షేమము, కార్యాచరణ వైభవము, ప్రతిభ, పాండిత్యము, సంగీత వాద్యములు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
షష్టమ భావము శత్రువు, రుణం మరియు రోగ స్థానం. రోగములు, ఋణబాధలు, తగాదాలు, పేచీలు, కౄర కార్యములు, పిసినారితనం, అపవాదులు, యాచకత్వం, అకాల భోజనం, జైలు, అన్నదమ్ములతో వైషమ్యాలు, దొంగతనం, మేనమామలు, ఆపదలు, ప్రేగులు, జీర్ణాశయం మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
సప్తమ భావము కళత్ర స్థానం. వ్యాపారములో భాగస్వాములు, భార్య, ద్వికళత్రం, దాంపత్య సుఖం, దొంగతనం, బుద్ధి మాంద్యము, వస్త్రములు, అలంకారములు, సుగంధద్రవ్యములు, పానీయములు, విదేశీ ప్రయాణములు, ధనార్జన, మూత్రము, మర్మస్థానముల మొదలైన వాటికి కారకత్వం వహిస్తాడు.
అష్టమ స్థానం ఆయుర్భావం. మరణము, మరణకారణము, వారసత్వము గురించి తెలియ జేయును. ఇంకా సుఖము, ఆపద, తగాదాలు, సోమరితనం, ధనవ్యయం, దురదృష్టం, మానసిక స్వభావం, అవమానం, పరధనము మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
నవమభావాన్ని భాగ్యభావం అంటారు. పూర్వజన్మ పుణ్యం కారణంగా కలుగు అదృష్టం, స్థితిగతులు, దూరప్రయాణాలు, ఆధ్యాత్మిక స్థితి, మంత్రోపాసన, గురువులను గౌరవించుట, విద్యార్జన, పిత్రార్జన, సంతానం, ఐశ్వర్యం, ఆచార సంప్రదాయాలు, దైవభక్తి, ఊరువుల మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
దశమభావం రాజ్యభావం అంటారు. ఉద్యోగం, వ్యాపారం, పేరు ప్రఖ్యాతులు, అధికారం, వృత్తి గురించి తెలియజేస్తుంది. దయాగుణం, యంత్రము, మంత్రము, అభిమానము, మాతృ దేవత, పదవి స్థానం, ఔషధము, బోధన, ముద్రాధికారం, సన్మానం, దేవతలు, పుణ్యము, దత్త పుత్రుడు మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
ఏకదశ భావమును లాభభావం అంటారు. అగ్ర సోదరులు, స్నేహితుల గురించి తెలియజేస్తుంది. వివిధ ఆదాయములు, వివిధలాభములు, తండ్రి సోదరులు, అలంకారములు, నగలు, కార్యసిద్ధి, ఆశయసిద్ధి, చిత్రలేఖనం, లలిత కళలు, మంత్రోపాసన, విద్య, బంగారం గురించి తెలియ జేయును.
ద్వాదశ భావం వ్యయభావం అంటారు. ధనవ్యయం, సమయ వ్యయం, పూర్వజన్మలు, రహశ్య శ్త్రువులు గురించి తెలియ జేస్తుంది. అది బంధనం, ఋణ విమోచనం, స్త్రీలోలత్వం, కళత్రహాని, విదేశప్రయాణం, ఉద్యోగ విరమణ, అధికార పతనం, మనోచంచలం, అహంకారం, శరీర అనారోగ్యం, మారకం మొదలైన వాటికి కారకత్వం వహిస్తుంది.
లగ్నపాదాలు నవాంశ చక్రం
జ్యోతిష శాస్త్రంలో నవాంశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక రాశిని తొమ్మిది సమ భాగాలుగా విభజించి ఆ రాశిలో ఉన్న గ్రహం ఏ నక్షత్రపాదంలో ఉందో నిర్ణయిస్తారు. నవాంశ ఆధారిత ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయని పలు జ్యోతిషశాస్త్ర పండితులు అభిప్రాయపడతారు. ఉత్తర భారతంలో జ్యోతిష పండితులు నవాంశ చక్కటి ఆధారంగా చాలా నిర్దుష్ట ఫలితాలు చెప్పగలరని ప్రతీతి. జ్యోతిష శాస్త్రంలో నవాంశకు చాలా ప్రాధ్యనత ఉంది.

లగ్నం మేషరాశి వృషభరాశి మిధునరాశి కర్కాటకరాశి సింహరాశి కన్యారాశి తులారాశి వృశ్చికరాశి ధనసురాశి మకరరాశి కుంభరాశి మీనరాశి
మేషం అశ్విని 1 అశ్విని 2 అశ్విని 3 అశ్విని 4 భరణి 1 భరణి 2 భరణి 3 భరణి 4 కృత్తిక 1 - - -
వృషభం రోహిణి 1 రోహిణి 2 రోహిణి 3 రోహిణి 4 మృగశిర 1 మృగశిర 2 - - - కృత్తిక 2 కృత్తిక 3 కృత్తిక 4
మిధునం పునర్వసు1 పునర్వసు2 పునర్వసు3 - - - మృగశిర 3 మృగశిర 4 ఆరుద్ర 1 ఆరుద్ర 2 ఆరుద్ర 3 ఆరుద్ర 4
కటకం - - - పునర్వసు4 పుష్యమి 1 పుష్యమి 2 పుష్యమి 3 పుష్యమి 4 ఆశ్లేష 1 ఆశ్లేష 2 ఆశ్లేష 3 ఆశ్లేష 4
సింహం మఖ 1 మఖ 2 మఖ 3 మఖ 4 పూర్వాఫల్గుణి1 పూర్వఫల్గుణి2 పూర్వఫల్గుణి3 పూర్వఫల్గుణి4 ఉత్తరఫల్గుణి1 - - -
కన్య హస్త 1 హస్త 2 హస్త 3 హస్త 4 చిత్త 1 చిత్త 2 - - - ఉత్తరఫల్గుణి2 ఉత్తరఫల్గుణి3 ఉత్తరఫల్గుణి4
తుల విశాఖ 1 విశాఖ 2 విశాఖ 3 - - - చిత్త 3 చిత్త 4 స్వాతి 1 స్వాతి 2 స్వాతి 3 స్వాతి 4
వృశ్చికం - - - విశాఖ 4 అనూరాధ 1 అనూరాధ 2 అనూరాధ 3 అనూరాధ 4 జ్యేష్ట 1 జ్యేష్ట 2 జ్యేష్ట 3 జ్యేష్ట 4
ధనసు మూల 1 మూల 2 మూల 3 మూల 4 పూర్వాషాఢ1 పూర్వాషాఢ2 పూర్వాషాఢా3 పూర్వాషాఢా4 ఉత్తరాషాఢ1 - - -
మకరం శ్రవణం 1 శ్రవణం 2 శ్రవణం 3 శ్రవణం 4 ధనిష్ఠ 1 ధనిష్ఠ 2 - - - ఉత్తర్రాషాడ2 ఉత్తరాషాఢ3 ఉత్తరాషాఢ4
కుంభం పూర్వాభద్ర1 పూర్వాభద్ర2 పూర్వాభద్ర3 - - - ధనిష్ఠ 3 ధనిష్ఠ 4 శతభిష 1 శతభిష 2 శతభిష 3 శతభిష 4
మీనం - - - పూర్వాభద్ర4 ఉత్తరాభద్ర1 ఉతారాభద్ర2 ఉత్తరాభద్ర3 ఉత్తరాభద్ర 4 రేవతి 1 రేవతి 2 రేవతి 3 రేవతి 4
విశ్లేషణ]
పైన ఉన్న నవాంశచక్రానికి విశ్లేషణ.

మేషం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల మొదటి పాదం మేషరాశిలో ఉంటాయి.
వృషభం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల రెండవ పాదం వృషభరాశిలో ఉంటాయి.
మిధునం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల మూడవ పాదం మిధున రాశిలో ఉంటాయి.
కటకం రాశి:- అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణ, పూర్వాభద్ర నక్షత్రాల నాల్గవ పాదం కటకరాశిలో ఉంటాయి.
సింహం రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన మొదటి పాదం సింహ రాశిలో ఉంటాయి.
కన్య రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన రెండవ పాదం కన్యారాశిలో ఉంటాయి.
తుల రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన మూడవ పాదం వృశ్చిక రాశిలో ఉంటాయి.
వృశ్చిక రాశి:- భరణి, మృగశిర, పుష్యమి, పూర్వఫల్గుణి, చిత్త, అనూరాధ, పూర్వాషాఢ, ధనిష్ట, ఉత్తరాభద్ర నక్షత్రాన నాలుగవ పాదం వృశ్చిక రాశిలో ఉంటాయి.
ధనుర్రాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల మొదటి పాదం ధనసు రాశిలో ఉంటాయి.
మకర రాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల రెండవ పాదం మకర రాశిలో ఉంటాయి.
కుంభరాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల మూడవ పాదం పాదం కుంభరాశిలో ఉంటాయి.
మీన రాశి :- కృత్తిక, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, జ్యేష్ట, ఉత్తరాషాఢ, శతభిష, రేవతి నక్షత్రాల నాలుగ పాదం మీన రాశిలో ఉంటాయి.🌹🌹🌹🌹

Thanks to Vamsi Nemani garu....

Thursday 5 January 2017

Hindu food preparation భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా?

భోజనం తర్వాత ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే దరిద్రం మీకు పట్టుకున్నట్టే!


"అన్నం పరబ్రహ్మ స్వరూపం".. సాక్షాత్తూ శ్రీ అన్నపూర్ణా దేవి ఆ పరమశివుడికి అన్నం ప్రసాదించింది. అదీ అన్నానికి ఉన్న గొప్పదనం. అందుకే భోజనం చేయడమంటే నోట్లోకి అన్నం వెళ్ళడమే కాదు.. వడ్డించడం నుంచి తిన్న తర్వాత చేసే పనులు కూడా భోజన ప్రక్రియలోకే వస్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాంటప్పుడు ఆహారం తినేప్పుడు మనం చేయకూడని పనుల గురించి మన ధర్మశాస్త్రాలు ఏం చెబుతున్నాయో? ఓ సారి తెలుసుకునేందుకు ప్రయత్నిద్ధాం.

భోజనం ఆరగించిన తర్వాత... చేతులని కంచం లేదా పళ్లెంలో ఎట్టి పరిస్థితుల్లో కడుగరాదు. ఇది పరమ దారిద్ర హేతువు. తిన్నాక కేవలం చేతులని వేరొక చోట మాత్రమే కడగాలి.

అన్నం ఆరగించిన కంచాన్ని... ఎప్పుడూ కూడా తిన్నచోటే వదిలేయకూడదు. ఇలా చెయ్యడం వల్ల దారిద్ర లక్ష్మి వచ్చి కూర్చుంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి.

అలాగే, భోజనం పూర్తయ్యాక ఎవరైనా చేసే పని కుడి చేతిని మాత్రమే కడగడం.. ఒక్క చేత్తోనే కదా తినేది రెండు చేతులు ఎందుకు అనే లాజిక్‌ని పాటిస్తారు. కానీ, భోజనం ఆరగించిన తర్వాత తప్పకుండా రెండు చేతులూ పరిశుభ్రంగా కడుక్కోవాలి.

చివరగా అన్నం ఆరగించి, చేతులు శుభ్రంగా కడిగిన తర్వాత చేతులతో పాటు.. మూతిని పరిశుభ్రమైన గుడ్డతో తుడుచుకోవాలి. అపుడే భోజనం పుష్టిగా ఆరగించినట్టు లెక్క.

Wednesday 4 January 2017

Swayambhu Komuravelli Mallanna

Image may contain: 2 people
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలంలో వెలసిన కొమురవెల్లి మల్లికార్జునుడు కొమురెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర అటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల ప్రజలకూ కొంగుబంగారమై అలరారుతున్నాడు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో మొదటి ఆదివారం నాడు మొదలుకొని చివరి ఆదివారం వరకు జాతరలు జరుగుతాయి. ఈ జాతరలు దక్షిణభారతంలోనే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటి అని చెప్పవచ్చు. చివరి ఆదివారం (డిశంబర్‌ 25) మల్లికార్జునుడి కళ్యాణం మహా వైభవంగా జరుగుతుంది. ఆ రోజున చుట్టుపక్కల గల నాలుగు రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
600 సంవత్సరాల నాటిది
కొమురవెల్లిలోని మల్లన్న ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నాటిదని స్థానికులు చెబుతారు. పాతికేళ్ల క్రితం ఈ ఆలయ సమీపంలో మొఘల్‌ చక్రవర్తి హుమయూన్‌ కాలంలోని నాణేలు దొరికాయి. దీన్ని బట్టి హుమయూన్‌ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ప్రసిద్ధమైనదన్న విషయం తెలుస్తోంది. కొమురవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట. ఆ పేరు రాను రానూ ‘కొమురవెల్లి’గా మారిందని అంటారు.
స్వయంభువు
ఇక్కడ మల్లికార్జున స్వామి స్వయంభువు అని అంటారు. అంటే స్వయంగా వెలిశాడని అర్థం. ఈ ఆలయాన్ని ఏ రాజులూ నిర్మించలేదనీ, అక్కడ ధ్వజస్తంభం, రాజ శాసనాలూ లేకపోవడమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడనటానికి నిదర్శనాలనీ పూజారులు చెబుతారు. శివుడికి గంగా, పార్వతుల్లా ఇక్కడి స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు. ‘ఖండోబా’ ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమురవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో, ఆ పూజారి ఇక్కడికి వచ్చాడనీ, అక్కడ నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయడం మొదలు పెట్టాడనీ ఒక కథ ప్రచారంలో ఉంది. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర ముగ్గురు రాక్షసుల తలలుంటాయి.
శివ కళ్యాణం
దాదాపు మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని ‘పట్టణం వారం’ (హైదరాబాద్‌ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని) గా పిలుస్తారు. ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటిరోజు ‘పట్నం’ వైభవంగా నిర్వహిస్తారు. రెండో ఆదివారం ‘లష్కర్‌ వారం’ గా ప్రసిద్ధి. ఈ వారం సికింద్రాబాద్‌ లష్కర్‌ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువగా తరలివచ్చి స్వామికి బోనాల నైవేద్యం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక మార్గశిర మాసపు చివరి ఆదివారం జరిగే కళ్యాణం ఓ ప్రత్యేక ఘట్టం. ఆ రోజు జరిగే శివకల్యాణం అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ చివరి వారం నాడు భక్తులు ఇసుకు వేస్తే రాలనంత సంఖ్యలో వస్తారు.
పట్నం అంటే..
ముగ్గూ మరియు ఇతర ఐదు రకాల ప్రకతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికనే ఇక్కడ పట్నంగా పిలుస్తారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గుపోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది. దీనినే స్వామివారికి పట్నం వేయడం అని అంటారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడూ శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గూ అందులో స్వామివారి ఉత్సవ మూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్దపట్నంగా పిలుస్తారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలలో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులూ శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది.
రెండు వంశాల అర్చకులు
ఇక్కడ స్వామి వారి కళ్యాణం జరిపించే అర్చకులు రెండు వంశాలకు చెందిన వారున్నారు. మహదేవుని వంశంవారు అమ్మవార్ల తరఫున కన్యాదానం చేయగా, పడిగన్న వంశంవారు స్వామి తరఫు వారిగా ఉండి కల్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తారు. చివరి రోజు అగ్ని గుండం తొక్కడంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచీ దాదాపు 300 మంది శివసత్తులు జాతర సమయంలో స్వామిని దర్శించుకుంటారు. దేవస్థానం తరఫున వీరికి చెల్ల, గంట, చీర, త్రిశూలం ఇచ్చి సన్మానించడం ఆనవాయితీ.
ఇక్కడి ఒళ్లు బండమీద చేతులు ఆన్చి మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. చుక్కలాది పర్వతం సూర్మాను గుండుగా పిలిచే రెండు పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు. ఆలయానికి సమీపంలో ఆంజనేయ, వీరభద్ర, రేణుక ఎల్లమ్మ, కొండపోచమ్మ దేవాలయా లున్నాయి. ఇవీ ఈ ఆలయంలో చెప్పుకోదగిన ప్రత్యేకతలు.
స్వయంగా వెలసిన ఈ మల్లికార్జున స్వామిని దర్శించండి, తరించండి....
(Courtesy: Jagriti Weekly)

Tuesday 3 January 2017

Worlds Oldest / Greatest University...? Takshashila...!!!

#ప్రపంచంలో_అతి_పురాతనమైన_విశ్వవిద్యాలయం-  #తక్షశిల, గాంధారి దేశం (నేటి పేరు- తక్షిల, పాకిస్తాన్)

         చాలా మందికి మీకు తెల్సిన గొప్ప విశ్వవిద్యాలయాల పేర్లు చెప్పండి అన గానే... ఓవర్ బ్రిడ్జి, ఫార్వర్డ్.. అని చెప్తుంటారు....ఠకిమని చెప్తారు.!!

          కాని..ప్రపంచంలో అతి పురాతన విశ్వవిద్యాలం మన అఖండ భారతదేశంలో ఉంది!!  చాలా మందికి తెలీదు.. సుమారు 2800-3000 సంవత్సరాల క్రితమే ఒక గొప్ప విశ్వవిద్యాలం మన వాళ్లు నడిపారని తెలీదు మన నిద్ర పోతున్న భారతీయులికి...

            సుమారు 10,500 విద్యార్దులు ప్రపంచ దేశాలనుండి వచ్చి ( చైనా, పర్షియా, ఈజిప్ట్, గ్రీకు...) చదువుకున్నారు  తక్షశిలలో... 64 కళలతో పాటు, 18 శాస్త్రాలను నేర్పించేవారు.. మొత్తం 82 సబ్జెట్స్ అని మాట!! ప్రవేశ పరీక్ష లో ప్రతీ ముగ్గురు లో ఒకరిని తీసుకునే వారు...

       ఉపాధ్యాయుల సంఖ్య, 2000 వరకు అంటే ప్రతీ ఇద్దరి విద్యార్దులకు ఒక గురువు అన్నమాట!!విద్యార్దులకు వసతి, భోజన సౌకర్యాలు ఉండేవి..

 #ఆల్యుమినీ (పూర్వవిద్యార్దులు)
1. కౌటిల్యుడు (అర్ధ శాస్త్రం రచయిత)
2.పానిని (సంస్కృతం వ్యాకరణ నిపుణుడు) 3. చరకుడు (ఆయుర్వేద నిపుణుడు)
4. జీవకడు (బింబిసారుడు, బుద్ధుడు యొక్క వైద్యుడు),
5. జోటిపాల... ఇంకాఎందరో మహానుభావులు!!

     #పరీక్షలు విధానం:- పరీక్షలు పెట్టి విద్యార్దులను వేధించరు.. ఒక సబ్జెక్ట్ పూర్తిగా నేర్చుకున్నాక వేరొక సబ్జెక్ట్ కి వెళ్తారు..

#ఫీజులు:- ఫీజులు ఏమి ఉండవు, చదువు పూర్తి అయ్యాక శిష్యుడు గురుదక్షిణ ఇస్తాడు..

#స్నాతకోత్సవం:- సర్టీఫికేట్లు ఇవ్వరు...జ్ఞానం లోపల ఉంటుంది..కాగితాలపైన కాదు.!!

#ప్రవేశ_వయస్సు:- 16-18 సంవత్సరాలు..

       
      ఇంత గొప్ప దేవాలయం విదేశీయుల అసూయకు గురి అయ్యింది!! నిరంతర దాడులకు గురి అయ్యింది!! దండయాత్ర లకు గురి అయ్యి తన వైభవాన్ని కోల్పోయింది!!! అందుకే నాకు,   పరాయి వాళ్లు నచ్చరు... అలనాటి ఆ మహా దేవాలయం లేకపోవచ్చు!! కాని భారతీయులందరిలో ఆ దేవాలయం యొక్క జ్ఞానం మన రక్తంలో ప్రవహిస్తుంది!!!!
                               
  Thanks to Appala Raju K ji...

శివాలయ దర్శన విధానం 🔔 🔔🔔 Shiva Pooja,..

శివాలయ దర్శన విధానం 🔔 🔔🔔
సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న ిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.
శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు.
అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.
శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.
తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.
5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.
శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.
ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.
ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.
ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..
ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.
ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.
వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...
శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.
శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..
క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.
ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...
అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీతోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.
తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.
శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.
మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రా
ముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"
హర హర మహా దేవ శంభో శంకర !🌹🌹🌹🌹

Banaganapalli, Andhra Pradesh To Sri Uma Maheswara Temple, Yaganti, Andhra Pradesh 518124

రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగాంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. అందమైన మా ప్రయాణం లో మేము చుసిన క్షేత్రాలు –వాటి వివరాలు బనగానపల్లె:- --------------- శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నేలమఠం,కాలగ్నానాన్ని పాతిపెట్టిన చింతమాను మఠం, రవ్వలకొండ ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయాలు. వీర బ్రహ్మేంద్ర స్వామి తన కల జ్ఞానాన్ని రాసిన ప్రదేశాలు ఈ క్షేత్ర సమీపంలోనే ఉన్నాయి . బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒకైంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ ఆయనను ప్రశ్నించి ఆయన ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె ఆయనకు పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఆయన గోవులకు ఒకావలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆవలయం దాటకుండా మేతమేస్తూ వచ్చాయి. ఒక రోజు ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ ఆయన ఏకాగ్రతగా వ్రాయడం పశువుల ప్రవర్తన గమనించి ఆయన ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా ఆయన నాకు దూషణ భూషణలు ఒకటేనని నీవైనా అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానభోద చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానభోద చేసాడు. యాగంటి:- --------- సృష్టి అంతమయ్యే సమయానికి యాగంటి బసవన్న రంకేలేస్తడు అని వీర బ్రహ్మం గారు తన కాలజ్ఞానం లో వివరించారు . బనగానపల్లె కి 12 కి మీ దూరం దట్టమైన గుహల మద్య ఎంతో రమణీయంగా వెలసిన క్షేత్రం యాగంటి ఉమా మహేశ్వర స్వామి దేవాలయం. ఎంతో అందంగా ఉండే ఈ దేవాలయం లో అందమైన కోనేరు, కొనెరులొ నంది పైనుండి జాలువారే నిటి ప్రవాహం కళ్ళను మహిమరిపించేల చేస్తాయి. ఇద్దరు బక్తుల కోరిక పైన స్వామి వారు ఇక్కడ వెలసారని చెబుతారు . ఆలయ నికి సమీపం లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక గుహలో ఉంది.అగస్త్యమహర్షి స్వామి వారు తపస్సు చేసిన గుహ ఒకటి ఉంది వీరబ్ర్హమేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసిన గుహ ఇంకోటి ఉంది . ఉమా మహేశ్వర ఆలయా మండపం ల ఉన్న నందీశ్వర స్వామి ఉంటారు . ఉమా మహేశ్వరుడు ఆర్ధనరిశ్వర రూపం లో స్వయం భు లింగం గ ఇక్కడ వెంచేసి ఉన్నాడు . ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో అగస్త్యుడు స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు. ఏ కాలంలో నైనా పుష్కరణి లోని నీరు ఒకె మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానె రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. శ్రీ పోతులూరి వీర బ్రంహం గారు రచించిన కాలగ్నానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగు తున్నాడని అన్నాడు. యాగంటి బసవన్న:- Image result for banaganapalli to yaganti
------------------- ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటం . పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేసాడని బ్రహ్మంగారి కాలఙానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది. బెలూం గుహలు:- Image result for banaganapalli to yaganti-------------------------- బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు బెలూం గుహల ప్రత్యేకత . సహజత్వానికి లోపం రాకుండా బెలూం గుహల అందాలు ద్విగుణీకృతమయ్యే విధంగా విద్యుత్ దీపాలను అమర్చారు. దిగుడు బావి మాదిరిగా ఉన్న ప్రవేశద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి, భూమికి 20 మీటర్ల అడుగున ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుందా ఉండేందుకు లోపలికి గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటుచేశారు . గుహల్లోపల ఫౌంటెన్ , కృత్రిమ కొలను ఏర్పాటు చేయటంతో, గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నయి. బెలూం గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. గండి వీరాంజనేయ స్వామి దేవాలయం :- ------------------------------------ “త్రేతా యుగంలో దశరధ నందసుడైన శ్రీ రామ చంద్రమూర్తి తన వనవాసకాలంలో స్వాహాస్తమూలతో తన నిశీత శిలీ ముఖంతో బాణపు కొనతో గిచిన ఆంజనేయ స్వామి నేడు గండి క్షేత్రం” పులివెందుల -రాయచోటి తాలుకాల సరిహద్దులలో పాపాగ్ని నది తీరాన రెండు కొండల నడుమ ఉన్న ఈ క్షేత్రం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . నదిలో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాల నుంచి విముక్తి లబిస్తుంది అని ప్రతీతి .రావణ వధ అనంతరం శ్రీ రాముడు లోంక నుంచి తిరిగి వస్తు కొంత కాలం ఇక్కడ గడిపడని, ఆ సమయం లోనే తన కోన గోటి తో ఆంజనేయ స్వామని చిత్రించాడని అదీ ఆంజనేయ స్వామి దేవాలయంగా వెలుగొందింది అని స్థల పురాణం చెబుతుంది . త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో దండకారణ్యం నుండి గండిక్షేత్రం మీదుగా రావడం జరిగింది. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. అతడు రామలక్ష్మణులకు ఆహ్వానం పలికి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకొనగా, రావణవధ అనంతరం తిరుగు ప్రయాణంలో నీ కోరిక తీరుస్తానని వాగ్దానం చేసాడు. రావణుని చంపి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నపుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు గండిలోని రెండుకొండలకు బంగారు తోరణం నిర్మించి శ్రీరామునికి స్వాగతం పలికాడు. శ్రీరాముడు ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. శ్రీరాముడు అక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై సీతాన్వేషణం మొదలుగా రావణాసురునిపై తన విజయానికి మూలకారణమైన వీరాంజనేయుని తన బాణపు కొసతో కొండశిల మీద చిత్రించాడు. చిత్రం చివరిదశలో లక్ష్మణుడు వచ్చి కాలహరణం సంగతి గుర్తుచేయగా ఆ తొందరలో శ్రీరాముడు ఆంజనేయుని చిత్రం ఎడమచేతి చిటికెనవ్రేలు విడదీయకుండా వెళ్ళిపోయాడు. ఆచిత్రరూపమే శ్రీ వీరాంజనేయుని విగ్రహముగా విరాజిల్లుతున్నది. ఈ విధంగా గండి క్షేత్రం ఏర్పడింది. ఇది పురాణం చెబుతున్న విషయం. ప్రొద్దుటూరు:- కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం లోని పినాకిని నది తీరాన గల ప్రసిద్ద క్షేత్రం ముక్తి రామేశ్వరం . ఈ క్షేత్రంలో శ్రీ రాములవారు ప్రతిష్టించిన శివలింగం ఉండటం వలన ఈ ప్రాంతానికి రామేశ్వరమని , మర్జలరుపన గల రావణుని శ్రీ రాముడు బాణాల చేత వాదించి ముక్తి లబించడం వలన ఈ ప్రాంతానికి ముక్తి రామేశ్వరం అని పేరు వచ్చింది అని చెబుతారు . 56 అడుగుల ఎత్తు గల సుందర రూపం గల లింగం ఈ దేవాలయం లో మనకు దర్శనమిస్తుంది . రావణ వధ అనంతరం హత్య దోషనివరణకు రాముడు ఈ ప్రాంతం లోని శివలింగాన్ని ప్రతిస్టించాడు అని చెబుతారు . రాముడు హనుమని కాశి పంపించి లింగాలను తీసుకోని రమ్మనగా సరి సమయం లో రాకపోవడం వలన రాముడే లింగాన్ని తాయారు చేసి ప్రతిష్టించాడట అ లింగాన్ని సైకత లింగం అని అంటారు . ఆ తరువాత హనుమ తీసుకోని వచ్చిన లింగాన్ని సమీపం లో ప్రతిష్టింరట . అందుకే ఈ క్షేత్రాన్ని రామలింగేస్వరం అనియు హనుమాన్ క్షేత్రం అని కూడా పిలుస్తారు . శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం అద్బుతమైన కట్టడాలు ,సుందరమైన గాలి గోపురం, కాలత్మకమైన చిత్రాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఆలయానికి సమీపం లో రాజ రాజేశ్వరి దేవాలయం కూడా ఉంది . జగద్గురు అది శంకరాచార్యులు ఈ దేవాలయం లో శ్రీ చక్ర యంత్రాన్నిప్రతిష్టించాడు. ఆలయ ఆవరణ లో చాల ఉపలయాలు ఉన్నాయి . ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించానీయమైన క్షేత్రం ఇది . మహానంది:- ------------------ పూర్వం శిలదుడనే మహర్షి సంతానం కోసం పరమేశ్వరుని గురుంచి తపస్సు చేసాడు . శివుడు ప్రత్యక్షమై కోరుకోమనగా నీకు భక్తులు అయి ఉండే ఇద్దరు పుత్రులను ప్రసాదించమని కోరాడు . ఈశ్వరుని కృప వలన ఇద్దరు కుమారులు జన్మించారు. వారి పేర్లు నంది ,పర్వతుడు. వారు పరమేశ్వరుని కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ముందుగ నంది వరం కోరుతూ , నువ్వు ఎల్లప్పుడు నా పై నివసించి ఉండాలి , నిన్ను నేను మోసే భాగ్యాన్ని ప్రసదించమించమని కోరాడు అతని కోరికగా శ్రీశైలానికి 200 కి మీ దూరం లో మహానంది రూపాన్ని పొందాడు . ఆనాటి నుంచి శివుని వాహనముగా మారాడు నంద్యాల నుండి 15 కి మీ దూరం లో ఉన్న ఈ పురాతన క్షేత్రం చాల మహిమన్మితమైనది . నందీశ్వర స్వామి కొలువై ఉన్నాడు . నంద్యాల చుట్ట పక్కల అన్ని కలుపుకొని నవ నందుల దేవాలయు ఉన్నాయి అందుకీ ఈ క్షేత్రాన్ని నంది మండలం అంటారు నవనందులు -------- కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

నందీశ్వరుని ఆలయము🕉🌺🌺యాగంటి🌺🌺 / పుణ్య క్షేత్రాలు / Spiritual places - Yaganti

Image result for yaganti

🕉నందీశ్వరుని ఆలయము🕉🌺🌺యాగంటి🌺🌺
జీవితకాలంలో ఒక్క సారైనా దర్శించదగిన అద్భుతాలకు నిలయం యాగంటి ఆలయము
యాగంటి ఉమామహేశ్వర ఆలయం

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం లోని ఎర్రమల కొండల్లో వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం యాగంటి. ఈ క్షేత్రం లో ఆది దంపతులైన ఉమామహేశ్వరులు మరి ఎక్కడా లేని విథంగా ఏకశిల లో స్వయంభువులు గా వెలసి, భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇచ్చటి యాగంటి బసవన్న తనస్వామితో సమానంగా కీర్తి ప్రతిష్టలను గడించాడు.

ఆలయ తోరణ ద్వారం

ప్రకృతి సోయగాలతో, ప్రశాంత ప్రదేశంలో భాసిల్లే ఈ క్షేత్రం లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు,పుష్కరుణులు యాత్రికులకు ఆనందాన్ని ఆహ్లాదాన్నే కాక దైవశక్తి మీద ఉన్న అపారమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచేవిగా కూడ కన్పిస్తాయి.

ఆలయ రాజగోపురం


యాగంటి క్షేత్ర నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఖచ్ఛితంగా తెలియక పోయినా ఇవన్నీ ఒకేసారి జరిగిన నిర్మాణాలు మాత్రం కాదనేది యథార్థం. ఈ నిర్మాణాలలో పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర రాజుల శైలి స్పష్టంగా కన్పిస్తుంది. పూర్వపు రాజులు అసంపూర్తిగా వదిలిన అనేక నిర్మాణాలను విజయనగర ప్రభువులైన హరిహరబుక్కరాయలు మరియు ఇతర విజయనగర ప్రభువులు పూర్తి గావించినట్లు చెప్పబడుతోంది .

పెద్ద పుష్కరిణి మథ్యలోని మండపం

ఆలయ విమానం మెట్లను కలిగి కోలగా నిర్మించబడటం( stepped pyramidal ) చాళుక్య వాస్తుకళకు ప్రతీక. అనగా ఇది 8-9 శతాబ్దాల నిర్మాణంగా చెప్పవచ్చు.ప్రథాన ఆలయం లోని మహామండపం, అలాగే కళ్యాణ మండపం, పుష్కరిణి ప్రాంగణము, ప్రాకార సాలు మండపాలు విజయనగర నిర్మాణ శైలిని ప్రతి ఫలిస్తున్నాయి. అంటే ఇవి 14-15 శతాబ్దాల నిర్మాణాలన్నమాట. ఈ ఆలయం చుట్టు ఉన్న ప్రాకార కుడ్యం కూడ ఇదే విషయాన్ని రూఢి చేస్తోంది.
ప్రథాన ఆలయ మహామండపంలోని గంట పై “క్రీ.శ 1775 లో విజయనామ సం.మార్గశిర బహుళ సప్తమీ గురువారం నాడు అవుకు గ్రామానికి చెందిన నాసయ్య కుమారుడైన ముసలయ్య గారి కుమారుడు నాగలింగం యాగంటీశ్వరునకు గంటను, వెండి గొడుగు ను సమర్పించెను “అని చెక్కబడి ఉంది.
ఈ ఆలయ రాజగోపురం ఐదు అంతస్తుల ఎత్తు కలిగి, అతి సుందరమైన శిల్పకళాసంపదతో అలరారుతూ, ఎత్తైన ఎర్రని కొండల మద్య వెండికొండ వలె ప్రకాశిస్తూ ,ఉంటుంది. ఈ గోపుర నిర్మాణం విజయనగర వాస్తు శిల్పకళానైపుణ్యలకు నిదర్శనం గా పరిశీలకులు భావిస్తున్నారు. ఇక్కడ “విజయబుక్కరాయలు” పేరుతో వ్రాయించబడిన ఒక ప్రాచీన శాసనం కూడ మనకు కన్పిస్తుంది.

అగస్య్త మహర్షి దక్షిణదేశ యాత్రలు చేస్తూ యాగంటి క్షేత్రాన్నిచేరాడు. ఇచ్చటి ఆహ్లాదకరమైన ప్రకృతిని, పర్వత గుహలను, జలపాతాలను చూసి, పరవశుడైన, ఈ సుందర ప్రకృతి నడుమ ఒక వైష్ణవాలయాన్ని నిర్మించాలనే సంకల్పం కలిగింది. అనుకున్నదే తడవుగా శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్ఠించడానికి సిద్ధపడ్డాడు. కాని ఆ విగ్రహానికి కాలి బొటన వ్రేలి గోరు శిథిలమై ఉండటాన్ని గమనించి ఆ విగ్రహాన్ని గుహలో అలాగే వదిలేశాడట. అదే నేడు కన్పించే శ్రీ వేంకటేశ్వరుని గుహ.

శ్రీ వేంకటేశ్వరుని గుహ

తన సంకల్పం భగ్నమైనందుకు బాథా సంతప్త హృదయుడైన అగస్త్యుడు పార్వతీ పరమేశ్వరులను గూర్చి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన ఆదిదంపతులు అగస్త్యుని అనునయించి, “ఈ ప్రదేశం శైవాలయానికి అనుకూలముగానున్నది.కావుననే నీ ప్రయత్నము భగ్నమైనదని “ ఓదార్చారు.వెంటనే అగస్త్యుడు చేతులు జోడించి “ ఓ ఆది దంపతులారా! ఈ లోకమునకు మాతా పితరులైన మీ ఇరువురు ఈ క్షేత్రమునందు ఉమామహేశ్వరుల రూపం ఏకశిలలో వెలసి భక్తులను అనుగ్రహించవలసినదిగా ఫ్రార్థించాడట.

ఉమామహేశ్వరుల దివ్యరూపం.

అగస్త్యుని అనుగ్రహించి ఆదిదంపతులు ఏకశిల లో ప్రత్యక్ష మయ్యారు. ఆ విథంగా ఉమామహేశ్వరులను దర్శించి మహదా నందం తో” నేగంటి “అంటూ ఆనందనాట్యం చేశాడు అగస్త్యుడు. ఆ క్షేత్రమే అనంతర కాలంలో” యాగంటి” అయ్యిందట.

శివభక్తులలో అగ్రగణ్యుడైన భృంగి ఈ గుహలలో తపస్సు చేసి, శివానుగ్రహం పొందినట్లు చెప్పబడుతోంది. ద్వాపరయుగం లో వనవాస సమయం లో పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు చెప్పబడుతోంది. కలియుగంలో శ్రీ ఆదిశంకరుని శిష్యుడు శ్రీ పద్మపాదుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు ప్రతీతి. ఈ కొండ గుహలలో కాలజ్ఞాన కర్త శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులైన గరిమిరెడ్డి అచ్చమాంబ, వెంకటరెడ్డి దంపతులకు ఆథ్యాత్మిక ప్రవచనాలు చేశారు. యాగంటి పల్లె నివాసులైన చిట్టెప్ప-లక్ష్మప్ప అనే గురుశిష్యులు యాగంటి ఉమామహేశ్వరులను సేవించి తరించి నట్లుగా కూడ ఒక కథ ప్రచారం లో ఉంది.

మహా మండపం స్థంభాలపై శిల్పకళ
ఈ ఆలయం గర్భాలయం, అంత్రాలయం,ముఖ మండపాలతో కూడిన ప్రథానాలయం పూర్తిగా రాతి తో నిర్మించబడింది.గర్భాలయం చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయం లో శ్రీ ఉమామమహేశ్వరులు ఏకశిలలో స్వయంభువులు గా వెలసి భక్తులకు కొంగుబంగారమై వెలుగొందు తున్నారు.

ప్రథానాలయం లోని ముఖమండపానికి తూర్పు,దక్షిణ ద్వారాలున్నాయి. ప్రథాన ఆలయ ముఖమండపాన్ని ఆనుకొని మహామండపం నిర్మించబడింది. 28 స్థంభాలతో నిర్మిం చ బడిన ఈ మహామండపం మథ్యలో ఉన్న నాలుగుస్థంభాలపై శివపార్వతుల కళ్యాణ ఘట్టాలు. రామాయణం లోని ఘట్టాలు రమణీయం గా మలచబడ్డాయి.

యాగంటి బసవన్న ఈ మహా మండపం లోనే ఈశాన్యం లో జగత్ప్రసిద్ది పొందిన యాగంటి బసవన్న కొలువుతీరి ఉన్నాడు. ఈ మండపానికి తూర్పు,ఉత్తర, దక్షిణ దిక్కులలో ప్రవేశ మార్గాలున్నాయి. ఈ యాగంటి బసవన్న సుమారు15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు కలిగి, ఒక చిన్నకొండ అక్కడ నందీశ్వరుడు గా వెలసిన అనుభూతిని కల్గిస్తుంది. ఈ నందీశ్వరుడు వేరొక చోట చెక్కి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినది కాదని చూడగానే మనం గమనించవచ్చు. మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడున్న ఒక చిన్నకొండ నే శిల్పాచార్యులు తన నైపుణ్యం తో నందీశ్వరుని గా మార్చినట్లు మన కర్థ మౌతుంది.

యాగంటి బసవన్న

80,90 సంవత్సరాలకు పూర్వం వరకు కూడ నాలుగుస్థంభాల నడుమ ఉన్న ఈ నందీశ్వరుని చుట్టు ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఖాళీస్థలం ఉండేదట. కానీ ప్రస్తుతం ఈ నందీశ్వరుడు మహామండపం నాలుగుస్థంభాలను ఆనుకొని కూర్చొని ఉన్న కారణం గా ప్రదక్షిణానికి అవకాశం లేకుండా పోయింది. దీన్నిబట్టి ఈ బసవన్న పెరుగుతున్నాడని అర్థమౌతోంది. పురావస్తుశాఖ వారు కూడ ఈ నందీశ్వరుడు ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం మేర పెరుగుతున్నట్లు లెక్కించారని స్థలపురాణం లో వ్రాయబడింది.ఇటువంటి జీవశిలను గుర్తించి నందీశ్వరునిగా మలచిన ఆ శిల్పాచార్యుని నైపుణ్యానికి మన తరం శిరసు వంచి శతథా, సహస్రథా కృతజ్ఞతాంజలులను సమర్పించాలి.

ఈ నందీశ్వరుని గురించి మరొక కథ కూడ ప్రచారం లో ఉంది. ఆలయ మహామండప నిర్మాణ సమయంలో అడ్డుగా ఉన్న పెద్ద బండరాయిని అథికారుల ఆజ్ఞానుసారం పగులకొట్టి ముక్కలు చేయగా మరుసటి రోజుకి మళ్లీ ఆ ముక్కలన్నీ ఒకటై బండగా ఏర్పడేదట. దానితో భయపడిపోయిన పనివారు దాన్ని అలాగే వదిలేశారని, ఆ బండరాయే అనంతరకాలం లో దైవానుగ్రహం వలన నందీశ్వరునిగా రూపుదాల్చిందని జనశృతి. ఈ నందీశ్వరుని గురించే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు “ యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమునందు రంకె వేసేనయా! “అని చెప్పారట.

ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ప్రథాన ఆలయానికి గల దక్షిణ ద్వారానిక్ ఎదురుగా వీరభద్రాలయం ఉంది. దీనిలో వీరభద్రుడు ఏడడుగుల ఆజానుబాహడై, ఉత్తరాభిముఖుడిగా దర్శనమిస్తాడు. చతుర్భుజుడైన ఈ స్వామి కుడి వైపు చేతుల్లో బాణాన్ని,ఖడ్గాన్ని,ఎడమ వైపుచేతుల్లో విల్లును, డాలును థరించి ఉంటాడు. ఆలయ ప్రాగణం లో ఉన్న ఉపాలయాలలో శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామిని, కాశీ విశ్వేశ్వరుని, మార్కండేశ్వరుని కూడ మనం దర్సించవచ్చు.

దైవ పుష్కరిణి యాగంటి మహా క్షేత్రాన్ని గూర్చి ప్రస్తావించేటప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పు కోవలసినవి పుష్కరుణులు. ఆలయ ప్రాకార కుడ్యానికి వాయవ్యంగా కన్పించే ప్రాకార గోపురంలోని ప్రవేశమార్గం “అగస్త్యపుష్కరిణి”కి దారి తీస్తుంది. దీనినే చిన్నకోనేరు అని కూడ పిలుస్తారు. ఈ పుష్కరిణి లోని నీరు స్వచ్ఛము,నిర్మలము,ఓషథీ యుక్తమై,సర్వపాపహారిణి గా, సర్వరోగనివారిణిగా చెప్పబడుతోంది. ఇది ప్రకృతి సిద్ధముగా ఏర్పడిన దైవ పుష్కరిణి. ఈ పుష్కరిణి లోకి నీరు ఈ క్షేత్రానికి 15 కి మీ.దూరంలో న్న ముచ్చట్ల అను పుణ్యక్షేత్రమునుండి పర్వత సానువుల గుండా దృశ్యముగా ప్రవహించుచూ ఇక్కడ దృశ్య మాన మౌతోంది. ఆనాడు అగస్త్యమహర్షి ఈ నీరు ఎక్కడనుండి వస్తోందో నని పరీక్షించదలచి, ముచ్చట్ల వద్ద నీటిలో పసుపు,కుంకుమ,పూలు కలిపెనట. ఈ రహస్య జల మార్గమును అగస్త్యుడు కనుగొనుట వలన దీనికి “అగస్త్యపుష్కరిణి” అని పేరువచ్చింది.

దీనిలో స్నానాలు, ముఖ పాదప్రక్షాళనలు నిషేథించబడ్డాయి. ఈ పుష్కరిణీ జలమునే శ్రీ ఉమా మహేశ్వరుల పూజా కైంకర్యాలకు వినియోగిస్తూ ఉంటారు . ప్రథాన ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దపుష్కరిణి లోనికి నీరు ఈ పుష్కరిణి నుండే చేరుతూ ఉంటుంది.

ఆలయానికి ఎదురుగా కన్పించే కోనేరు ను “ పెద్దకోనేరు“అంటారు.ఈ కోనేరు చుట్టు ప్రాకారకుడ్యం, ఈ ప్రాకార కుడ్యాన్ని ఆనుకొని 52 రాతిస్థంభాలతో కూడిన సాలుమండపం కలిగి, నాలుగు వైపుల ప్రవేశద్వారాలతో,వానిపై సుందరమైన మూడంతస్తుల గోపురాలతో, వానిపై అద్భుత మైనశిల్పకళాచాతుర్యం తో, కోనేటి మథ్య లో అందమైన నాలుగు స్థంభాల మండపం తో, మండపం మథ్యలో ముచ్చట గా కొలువు తీరిన నందీశ్వరునితో , చూపరులకు ఒక సుందర మనోహర దృశ్యాన్ని కనులముందు నిలబెడుతుంది. పడమరవైపు ప్రాకారకుడ్యాన్ని ఆనుకొని వెలుపల కూడ సాలుమండపం నిర్మించబడింది. ఇది సాధువులకు వసతిని కల్పిస్తోంది.

ఆలయ రాజగోపుర మనోహర దృశ్యం

ఈ కోనేటి లో నీటి మట్టం ఎప్పుడూ ఐదు అడుగులకు మించకుండా ఉండేటట్లు మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. కోనేటి లోపలి అంచులలో కుడ్యాలమీద నీటిపై తేలియాడుతున్నట్లు మనోహరమైన శిల్పాలు చెక్కబడ్డాయి. వానిలో ఉమామహేశ్వరులు, శివతాండవం,కిరాతార్జునీయం, లక్ష్మీనారాయణులు, నరసింహుడు, అనంతపద్మనాభుడు వంటి శిల్పాలెన్నో ఉన్నాయి. ఈ శిల్ప సంపదంతా విజయ నగర శైలినే పోలి ఉంటుంది. ఈ పుష్కరిణి యాత్రికుల పుణ్యస్నానాలకు ఉపయోగ పడుతోంది. అన్నికాలాలలోను ఇక్కడ నీరు ఉండటం విశేషం. ఈ నీరు వెలుపలకు వెళ్లి ఒక కి.మీ దూరం ప్రవహించి అక్కడ 16 ఎకారాలకు మాత్రమే సేద్యానికి నీటిని అందించి, ఆ తరువాత అదృశ్యమై పోతుందని ఇక్కడ పూజారి గారు చెపుతున్నారు. ఈ కోనేటిని చూడగానే మనకు వెంటనే మహానంది క్షేత్రం లోని కోనేరు గుర్తుకొస్తుంది.

పెద్దకోనేరు లోపలి అంచున మలచిన శిల్పాలు

ఎర్రమల కొండలుగా ప్రసిద్దిపొందిన ఈ కొండలలో అనేక ప్రకృతిసిద్ధమైన గుహలు ఏర్పడ్డాయి. రోకళ్లగుహ, శ్రీవేంకటేశ్వరగుహ, శంకరగుహ, ఎర్రజాలగుహ వానిలో ముఖ్యమైనవి.

కోనేటి మండపం లోని నందీశ్వరుడు

ఆకాశదీపం ప్రత్యేకత. ఆలయాలలో థ్వజస్థంభానికి వ్రేలాడదీయడం ద్వారా కాని,థ్వజస్థంభం దగ్గరగా కాని ఆకాశ దీపం వెలిగించడం ఆచారం. కాని ఈ క్షేత్రం లో గర్భాలయానికి వెనుకవైపున ఉన్న పర్వతశిఖరాగ్రాన ఆకాశదీపాన్ని వెలిగించడం ఆచారం గా వస్తోంది. ఇక్కడ ఆకాశ దీపారాధన చేస్తే సమస్త గ్రహ దోషాలు తొలగి, కోరుకున్నకోరికలు నెరవేరుతాయని, కుటుంబం సుఖ సౌఖ్యాలతో అభివృద్ధి చెందుతుందని అనాదిగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందునా అమావాస్య రోజున ఆకాశదీపాన్ని వెలిగింప చేస్తే సకల అరిష్టాలు తొలగిపోతాయని కూడ భక్తులు విశ్వసిస్తారు.

ఆకాశ దీపం పెట్టే కొండ కొన

కాకులు కన్పించవు. ఈ క్షేత్ర ప్రాముఖ్యలలో మరొకటి ఈ క్షేత్రం లో శనీశ్వరుని వాహనమైన కాకికి ప్రవేశము లేదు. అగస్త్యుడు తపస్సు చేసుకుంటుంటే కాకసురుడనే వాడు కాకుల సమూహం తో వచ్చి అగస్త్యుని తపస్సుకు ఆటంకం కలిగించాడట. అది సహించలేని అగస్త్యమహర్షి ఈ ప్రాంతంలో కాకులు సంచరించరాదని శపించాడట. కనుకనే ఈ దివ్యక్షేత్రం లో కాకి మచ్చుకైనా కన్పడదు.అందువల్లనే ఈ క్షేత్రం శనిప్రభావం లేని దివ్యక్షేత్రం గా చెప్పబడు తోంది. ఆ కారణం గానే ఈ ఆలయం లో నవగ్రహ మండపం లేదు.

ఆలయానికి ఎదురుగా ఉన్న నందిస్థంభం

ఈ ఆలయం జాతీయప్రాముఖ్యత గల కట్టడం గా గుర్తించబడి, ఫురావస్తు శాఖ అథీనం లో ఉంది. అయినప్పటికీ నిత్యపూజాదికాలు, ప్రత్యేక ఉత్సవాలను దేవాదాయశాఖ నిర్వహిస్తోంది.

ప్రతి సోమవారం ,మరియు పర్వదినాల్లో భక్తులు విశేషం గా వచ్చి శ్రీ స్వామివారిని సేవించుకుంటారు. కార్తీక,దీపోత్సవాలు ఘనంగా జరుగుతాయి.. మహాశివరాత్రి ఉత్సవాలను మూడురోజులు అత్యంత వైభవం గా నిర్వహిస్తారు కళ్యాణ, రథోత్సవ,పల్లకీ సేవాకార్య క్రమా లకు భక్తులు పెద్దసంఖ్య లో పాల్గొని తరిస్తారు. సంక్రాంతి రోజున పారువేట ఉత్సవం ఐదు గ్రామాలమీదుగా వైభవం గా జరుగుతుంది.మాఘమాసానికి 11 రోజులముందు ఉమామహేశ్వరమాల మండలదీక్షను భక్తులు ఆచరిస్తారు .

యాగంటి క్షేత్రదర్శనానికి వచ్చే యాత్రికులకు ఉమామహేశ్వర నిత్యాన్నదాన సత్రం లో భోజనసౌకర్యం ఉంటుంది.

నంద్యాల రైల్వేష్టేషన్ నుంచి 50 కి.మీ దూరం లోను,బేతంచర్ల నుంచి ఇరవై కి.మీ దూరం లోను ఈ యాగంటి పుణ్యక్షేత్రం ఉంది.కోనేరు లో కోనేరులో నీరు ఎక్కడ నుండి వస్తుందో... తెలియదు...సంవత్సరం లో 365 రోజులు నీరు ఉంటుంది...నీరు గుడి బయటకు వచ్చిన తర్వాత మాయమవుతుంది... అది ఎక్కడకు వెళ్తుందో తెలియదు... అక్కడ బోర్ వేసిన చుక్క నీరు కూడా పడదట...                      

Indian Heritage Sanathana Dharmam

ఓ భారతీయుడా మేలుకో...

నీ కుటుంభం లోని రెండు మూడు తారాలెయ్ నీకు తెలియవు... ఇక దెస చరిత్ర గురించి ఎందుకులేవోయ్...

మూలాలు మనవి, తెలివితేటలూ మనవి, యోగ, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేదం మనది, ప్రపంచం మెచ్చే కుటుంభ వ్యవస్థ మనది...

5000 నంవత్సరాల పూర్వం మనకు ఉన్న జీవన ప్రమాణాలు...తెలుసా...?
తెలియకపొథెయ్ రామాయణ, భగవద్గీత చదువుకో....

ఇప్పటి హిందూ వివాహ చట్టానికి మూలం మన మనుస్మృతి...
మనుచరిత్ర ఉమ్మడిగా దహనం చేసుకొనే మూర్కులను తయారుచేసిన నేటి విద్యవ్యవస్థ కి జె ... జె... లు పలుకుదామా...
ఓ తెల్లవాడి పెంపుడు కుక్కలా ఉందామా...
భారత జాతి కొదమ సింహం ల బ్రతకటం  కోసం ముందడుగు వేద్దామా...

ఓ భారతీయుడా మేలుకో...

కోటు వేసుకొని దోచుకునే దొర సంస్కృతి వదిలి తల్లి ఒడిలాంటి సనాతన ధర్మం వైపు ముందడుగు వెయ్యవోయి భారతీయుడా...

100 సంవత్సరాలలో ఎటులాగివేయబద్దం మనం..
అశోకుడు చెట్లు నాటించెను... షాపింగ్ మాల్స్ ని ప్రోత్సహించి మనం వాటిని నరికించెను...
రాయల కలం లో రత్నాలు రాసుల పోసి అమ్మేయ్ వాళ్ళు... కోహినూర్ కొట్టుకెళ్లింది తెల్ల వాళ్ళు..

జై భరత్ మాత...జై జై సనాతన ధర్మం.....

నిన్ను కుక్కలా హీనంగా చుసిన తెల్లోడి మాటల్లో విని అయినా తెలుసుకో...
Thanks to sripathy chidambhara sastry garu for the picture...