🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఏకాదశి కథ
ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.
ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
తాత్త్విక సందేశం:
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.
పండగ ఆచరించు విధానం:
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7 .మరునాడు అన్నదానం చేయాలి..
ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు.
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.
సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల మరియు కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలొనున్నవి.
మాసము మాస దేవడు శుద్ధ ఏకాదశి పర్వదినం బహుళ ఏకాదశి పర్వదినం
చైత్రము విష్ణువు కామదా వరూథినీ
వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా
జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ
ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా
శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా
భాద్రపదము హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా
ఆశ్వయుజము పద్మనాభుడు పాశాంకుశ రమా
కార్తీకము దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి
మార్గశిరము కేశవుడు ధృవ, మొక్షద సఫల
పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా
మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ
ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ
అధికము (ఒకసారి,
3 సంవత్సరములకు) పురుషోత్తముడు పద్మినీ పరమా
మాసము/పక్షము/తిథి పర్వదినం
చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి
💐💐💐💐💐💐💐

No comments:
Post a Comment