Wednesday 21 December 2016

Aadivaram /Surya Bhagavanudu

ఆదివారం ఆ ఆహారం వద్దు.
🌹🌹🌹🌹🌹💐💐
సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యారాధన అనాదిగా ఉన్నదే.  ఒక్కొక్క దేవునిక ఒక్కో రోజు ప్రతీకరం. ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు. సూర్యుడు నవగ్రహాధిపతి అని వేదాలు చెబుతున్నాయి. అందుకే ఆలయాల్లో సూర్యుడు నవగ్రహాల మధ్యన ఉంటాడు. ఉదయం నిద్రలేవగానే సూర్యుడి నమస్కారం చేయ డం, సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంహిందూ సంప్రదాయంలో ఉంది. సూర్యుని రథానికి ఏడు గుర్రాలని, అవి ఏడు రంగుల ఇంద్రధనస్సుని సూచిస్తాయని అంటుంటారు.
హిందువుల్లో కొందరు కొన్ని రోజుల్లో మాంసాహారం తినరు. సాధారణంగా శనివారం, సోమవారం, శుక్రవారం మాంసాహారం నిషిద్ధం. అలాగే కొన్ని పండుగలు, పూజలు, వ్రతాలు నిర్వహిం చేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఆదివారం ఎక్కువ మందికి సెలవు కావడం వల్ల ఆ రోజు మాంసాహారం తినడం ఎక్కువగా ఉంటోంది. కొందరు దేవతల పూజల సమ యంలో మాంసాహారం నిషిద్ధం. ఆదివారం కొన్ని రకాల ఆహారా లను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆహారాలను ఆదివారం తింటే.. సూర్యదేవుడి ఆగ్రహానికి గురవుతారని చెబు తున్నాయి. ఉదాహరణకి సాంబ పురాణంలోని సూర్యాష్టకంలో ‘స్త్రీ, తైల, మధు, మాంసాని యత్యజేస్తు రవేర్డినే నవ్యాధి శోక దారిద్య్రం సూర్య లోకం సగచ్ఛసి’ అని ఉంది. అంటే ఆదివారం బ్రహ్మ చర్యం పాటించి నూనె, మద్య, మాంపాలకు దూరంగా ఉంటే వ్యాధులు, శోకం, దరిద్రం ఉండవని అర్థం. అందువల్ల ఆదివారం కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.
ఎర్ర కందిపప్పు: ఎర్ర కందిపప్పులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. కానీ జాతకంలో సూర్యుడు అధిపతిగా కలిగి ఉన్నవాళ్లు వీటిని ఆదివారం తినకూడదు.
వెల్లుల్లి: బ్లడ్‌ ప్రెజర్‌కు వెల్లుల్లి మంచిదని చెబుతారు. అయితే ఆదివా రం మాత్రం దీన్ని తీసుకోకూడదని చెబుతారు.
చేపలు: చేపల్లో ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదివారం వాటిని తినకూడని అంటారు.
ఉల్లి: ప్రతి వంటలో ఉపయోగించే ఉల్లిపాయను ఆదివారం తీసుకోవడం మంచిది కాదని కూడా నిషేధం విధించారు.
ఈ ఐదు పదార్థాలను ఆదివారం ఎందుకు తీసుకొకూడదనే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఇందుకు ఒక కథ ప్రచారంలో ఉంది. హిందూమతం ప్రకారం ఆవు పూజించదగినది. ప్రాచీన కాలం నుంచి ఈ పద్ధతి ఉంది. ఒకసారి ఒక మహర్షి ఎవరో చంపివేసిన తన ఆవును సాయంత్రానికి మళ్లిd బతికేలా చేయడానికి మంత్ర శక్తిని వినియోగించాలని భావించాడు. ఆ మంత్ర ప్రక్రియ పూర్త య్యే వరకూ మహర్షి భార్య సైతం ఉపవాసం చేయాలి. అయితే బలహీనంగా ఉన్న మహర్షి భార్య ఆకలికి తట్టుకోలేకపోయింది. అయితే పండ్లు, ఆకులు తినవచ్చని మహర్షి దంపతులు అవి తిన్నారు.
ఇదే సమయంలో ఆహారం సరిపోని మహర్షి భార్య అక్కడ చనిపోయిన ఉన్న ఆవు నుంచి ఒక ముక్క తీసుకుని వం డటానికి ప్రయత్నించింది. అయితే ఆ మాంసం వాసన ఎక్కువ సేపు భరించలేక దానిని అడవిలోకి విసిరింది. అది రెండు ముక్కులుగా పడింది.
సాయంత్రానికి ఆవును మహర్షి బతికించడంతో అడవిలోకి విసిరేసిన ఆవు మాంసం కూడా వెనక్కి వచ్చింది. అందులో కండ భాగం వెల్లుల్లిగా మారగా, రెండో మాంసం ముద్దకు చేప రూపం వచ్చింది. రక్తం ఎర్ర కందిపప్పు రూపంలొకి మారింది. అందుకే ఆదివారం ఈ ఆహారాలను తీసుకుంటే.. ఆవును వధిం చినంత పాపం కలుగుతుందనే ఉద్దేశంతో వీటిని తినకూడదని సూచించారు.

No comments:

Post a Comment