Monday, 27 August 2018
Friday, 24 August 2018
Sunday, 8 July 2018
Caste / Profession / Hindu Culture
మా రాముడు *క్షత్రీయుడు*
రాముని చరిత్ర మాకందించింది
*బోయవాడు*
రాముని కి లోకజ్ఞానం నేర్పింది *నిమ్న జాతి సుమంతుడు*......
రాముని గురుపత్నీ అరుంధతీమాత *మాదిగ స్త్రీ*.....
రాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు *నిషాదుడు (జాలరి)*..
తన అకలి తీర్చిన *కోయ జాతి* స్త్రీని శబరి మాతా అన్నాడు మా రాముడు...
క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్న ి గా స్వీకరించి మోక్షం ఇచ్చాడు మా రామచంద్రుడు..
*వనచరులనే* (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు రఘురాముడు......
సేతు నిర్మాణం నిర్వహించిన రాముని సలహా దారులు నలుడు,నీలుడు *వడ్డెర కులస్థులు*
నీతి తప్పిన భ్రాహ్మాణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురు తుల్యుడు *శ్రీఆది జాంబవంతుడు*మాది గ జాతి వాడు*...
.యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది *గిరిజనుడైన సుశేనుడు*.....
రావణసంహారానికి సహకరించినది *భ్రాహ్మాణుడు*. .
ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది *చాకలి వ్యక్తి*.......
పట్టాభిషేకానికి బంగారు జనకజను తయారు చేసింది *విశ్వ కర్మలు*.......
*మా సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం*...... .
*విదేశీ కుక్క బిస్కెట్లు తిని మొరగె కుక్కలకేం తెలుసు హిందూ ధర్మం చరిత్ర.
రాముని చరిత్ర మాకందించింది
*బోయవాడు*
రాముని కి లోకజ్ఞానం నేర్పింది *నిమ్న జాతి సుమంతుడు*......
రాముని గురుపత్నీ అరుంధతీమాత *మాదిగ స్త్రీ*.....
రాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు *నిషాదుడు (జాలరి)*..
తన అకలి తీర్చిన *కోయ జాతి* స్త్రీని శబరి మాతా అన్నాడు మా రాముడు...
క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్న
*వనచరులనే* (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు రఘురాముడు......
సేతు నిర్మాణం నిర్వహించిన రాముని సలహా దారులు నలుడు,నీలుడు *వడ్డెర కులస్థులు*
నీతి తప్పిన భ్రాహ్మాణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురు తుల్యుడు *శ్రీఆది జాంబవంతుడు*మాది
.యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది *గిరిజనుడైన సుశేనుడు*.....
రావణసంహారానికి సహకరించినది *భ్రాహ్మాణుడు*.
ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది *చాకలి వ్యక్తి*.......
పట్టాభిషేకానికి
*మా సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం*......
*విదేశీ కుక్క బిస్కెట్లు తిని మొరగె కుక్కలకేం తెలుసు హిందూ ధర్మం చరిత్ర.
Tuesday, 29 May 2018
శ్రీ మహావిష్ణువుకు అమితంగా ఇస్టమైనది...
సాధారణంగా ఆలయదర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తూ ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే చెప్పాడు.
పూర్వం గూడకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళబుచ్చేవాడు.. గూడకేశుడు విష్ణువుభక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు.
ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చెయ్యాలని అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తప్పస్సుని మెచ్చిన విష్ణువుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావలో కోరుకోమన్నడు. అందుకు గూడాకేశుడు, తనకు ఏమీ అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణువుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణువుచక్రం వల్ల మాత్రమే ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యడు. గూడకేశుడు సంతోషించాడు.
విష్ణువుమూర్తి అనుగ్రహించిన అనంతరం గూడకేశుడు తపస్సు చేస్తున్నే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికెను తీహాలని విష్ణువుమూర్తి నిర్ణయించుకుని,మిట్టమధ్యానపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేర్తుందా అని ఎదురు చుస్తున్న గూడకేశుడు మిక్కిలి సంతోషించాడు.
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెఎంటనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గూడకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి.
రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు . అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవెద్యం సమర్పించతం వెనుక ఇంత కథ ఉంది.
సత్యనారయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర !కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలాగ ఒక్కొక్క దేవత కు ఒక్కొక్క ప్రసదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కుడా మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివెదన చేసి మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణపరబ్రహ్మం ఎప్పుడు లోకక్షేమమే కద చూస్తాడు ..లోకసమస్త సుఖినో భవంతూ !!!!!!!

Wednesday, 12 April 2017
About Hanuman Jayanthi...
శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ?
మంగళవారం, చైత్ర పౌర్ణిమ, శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)
''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు,
హనుమంతుడు.
హిందూమతంలో ప్రాముఖ్యత :
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
హనుమంతుని నైజం
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.
భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. .(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.
Sunday, 9 April 2017
Shiva-Tatvam కంచి మఠం
శివతత్వం
శివశంకరన్ కంచి మఠానికి
చాలాకాలంగా పెద్ద భక్తుడు. ఒకరోజు పరమాచార్య స్వామి వారి దర్శనానికి మఠానికి వచ్చినప్పుడు ఒక సేవకుడు అతనితో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అతను దాన్ని తనకు జరిగిన అవమానంగా తలచాడు. వెంటనే స్వామి వద్దకు వెళ్ళి ఆ సేవకునిపై చాడిలు చెప్పాలని అతనికి లేదు. అతనికి ఒకసారి స్వామివారితో మాట్లాడే అవకాశం దొరికింది.
ఏదో సందర్భానుసారంగా మాట్లాడుతూ పరోక్షంగా తన గుండెల్లో ఉన్న బరువు దింపుకోవడానికి, అరటిపండులోకి సూదిని గుచ్చినట్లుగా, “మఠం పరిచారకులు కొంతమంది చాలా కఠినంగా మాట్లాడుతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇతరులతో డబ్బు పుచ్చుకుంటున్నారు. పరమాచార్య స్వామివారు వీళ్ళతో ఎలా వేగుతున్నారో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది” అని అన్నాడు
మహాస్వామి వారు గట్టిగా నవ్వారు. “నువ్వు చెప్తున్నది నాకేమి కొత్తది కాదు” అన్నట్టుగా చూసి, మాట్లాడడం మొదలుపెట్టారు.
”వేలమంది పనిచేసే ఒక కర్మాగారం తీసుకుందాం. అందరూ నైపుణ్యం కలవారు మంచివారు కాదు కదా? ఎన్నో లక్షల మంది పభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్నారు. అందరూ ఒకేరకమైన నిబద్ధతతో పని చెయ్యరు. చాలా మంది అసలు పని కూడా చెయ్యరు. పని చేసినా అది సరిగ్గా చెయ్యరు, అసంపూర్ణంగా చేస్తారు. కాని వాళ్ళను ఇంటికి పంపించలేము.
మొత్తంగా ప్రభుత్వం పనిచేస్తోంది కదా అది ముఖ్యం. ఇది సరిగ్గా పనిచేస్తుంటే చాలు. ఇది మాత్రమే సాధ్యపడుతుంది. శ్రీమఠం ఒక పెద్ద సామ్రాజ్యం లాంటిది. చాలా రకములైన పరిచారకులు ఉంటారు ఇక్కడ. నీకు పరమేశ్వరుడు తెలుసా?” అని అడిగారు.
శివశంకరన్ కు శ్రీమఠంలో ఆ పెరుగలవారు ఐదారుగురు తెలుసు. ఎవరి గురించి మహాస్వామి వారు అడుగుతున్నారో అతనికి అర్థం కాలేదు.
అతని అవస్థ చూసి స్వామివారు ”నేను చెప్తున్నది కైలాసవాసి అయిన పరమేశ్వరుని గురించి. అతని కంఠంలో పాము ఉంటుంది. ఒక చేతిలో అగ్ని ఉంటుంది. కాళ్ళకింద దురాశకు ప్రతిరూపమైన ఒక దేవతని తన ఆధీనంలో తొక్కి ఉంచుతాడు. భూతములు, దెయ్యాలు అతని గణాలు. వీటన్నిటిని వెంటబెట్టుకుని నృత్యం చేస్తుంటాడు విశ్వమంతా తిరుగుతూ.
పామును కనక వదిలేస్తే అది స్వేచ్ఛగా తిరిగి అందరిని భయపెట్టి కాటేస్తుంది. అగ్నిని నియంత్రించక పోతే, అది స్థావర జంగమాలను దహించివేస్తుంది. భూతపిశాచ గణములను వదిలేస్తే ఎవర్ని పడీతే వారిపై దాడి చేస్తాయి. అవి చేసే ఘోరాలను చెప్పవలసిన పని లేదు. ఇటువంటి చెడ్డ శక్తులను తన వద్ద ఉంచుకోవడమే పరమేశ్వరుని గొప్పతనం” అని చెప్పారు.
శివశంకరన్ ఇదంతా విని నిర్ఘాంతపోయి మౌనంగా నిలుచున్నాడు. మహాస్వామి వారు అతణ్ణి మృదువచనాలతో సంతృప్తి పరుస్తారు అనుకున్నాడు. కాని స్వామి వారి మాటలు ప్రపంచ రీతులని బట్టబయలు చేసారు.
ఇది శివశంకరన్ కు మాత్రమే కాదు. భక్తులందరికి శుద్దమైన ఆలోచనలు కలిగిస్తుంది. ఉన్నత స్థితిని కలిగిస్తుంది.
!! యద్భావం తద్భవతి !!
--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Thursday, 30 March 2017
తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు. కానీ, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం...
🕉ఉగాది శుభాకాంక్షలు🕉
తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు. కానీ, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది.
నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
తెలుగుసంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిధులు:
👉 మన తెలుగు సంవత్సరాల పేర్లు:
1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. ఆంగీరస
7. శ్రీముఖ
8. భవ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాథి
14. విక్రయ
15. వృక్ష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్థివ
20. వ్యయ
21. సర్వజిత్
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవలంభి
32. విలంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృత్
37. శోభకృత్
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృత్
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాళయుక్త
53. సిద్ధార్థి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుబి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ
👉 సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది...
ఆయనములు 2: అవి...
ఉత్తరాయణము:
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంత బాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.
దక్షిణాయణం:
కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకర రాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.
👉 సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది... అందుకే ఋతువులు ఆరు...
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర.
👉 సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది... అందుకే
మాసములు 12:
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)
👉 పక్షములు 2:
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం (కృష్ణ అంటే నలుపు అని అర్థం) ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.
👉 ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి. అవి...
పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి/అమావాస్య.
👉 ఇక ఒక పక్షానికి రెండు వారములు. ఒక వారమునకు ఏడు రోజులు...
👉 ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే.. భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..
ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు...
🕉మనకు అసలైన నూతన సంవత్సరం🕉ఉగాదే🕉 ఇప్పటినుండే మన 💎వాతావరణంలో మార్పు మొదలవుతుంది... 💎పంచాగం మొదలవుతుంది..💎 సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే "ఉగాది" అయింది..
👉 ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల 💎స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. 💎క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది... అందుకే ఇది ప్రతి ఒక్కరిలో నూతనత్వానికి నాంది పలికి.. నిత్య నూతన ఆశలతో క్రొత్త సంవత్సరం ప్రారంభమవ్వాలని..
అందరికీ...
💐నూతన సంవత్సరాది శుభాకాంక్షలు💐

Subscribe to:
Posts (Atom)