Tuesday, 16 October 2018

Sapta Rushi... couple catogorization according to Hindhu Mithology

ప్ర' పంచ'  దంపతులు..!!💐శ్రీ💐

ఈ లోకంలో..కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా..
5 విధాలుగానే ఉంటారు.

మొదటిది లక్ష్మీనారాయణులు..💐
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి,
అక్కడే లక్ష్మి ఉంటుంది,
అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..
ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..
ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.

రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం..💐
తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు,
రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,
ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం,
కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త,
బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

మూడవది బ్రహ్మ సరస్వతుల జంట.💐
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం,
దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.
ఇలా ఏ మాట మాట్లాడినా,
ఆ భార్య మాటే మాట్లాడే భర్త,
ఆభర్త మాటే మాట్లాడే భార్య ..
ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

నాల్గవది ఛాయా సూర్యులు.💐
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు,
విపరీతమైన తీక్షణత కలవాడు.
అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో.
ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

ఐదవది రోహిణీ చంద్రులు.💐
రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే
సామెత ఉంది,
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,
లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో,
భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

ఈ 5 జంటలలో మీరు ఏ జంటలో ఉన్నారు..!!💐

లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐

                       💐శ్రీ మాత్రే నమః💐

Friday, 24 August 2018

Smallest cow breed all over the world

#Punganure #DesiCowBreeds #SmallestCow


పుంగనూరు.  మా  అబ్బాయి  పెంచుతున్నాడు      ముందు  ఉన్న  దానిని  4 లక్షలకు  అడిగారు


Sunday, 8 July 2018

Caste / Profession / Hindu Culture

మా రాముడు *క్షత్రీయుడు*

రాముని చరిత్ర మాకందించింది
*బోయవాడు*

రాముని కి లోకజ్ఞానం నేర్పింది *నిమ్న జాతి సుమంతుడు*......

రాముని గురుపత్నీ అరుంధతీమాత *మాదిగ స్త్రీ*.....

రాముని నదిదాటించిన మిత్రుడు గుహుడు *నిషాదుడు (జాలరి)*..

తన అకలి తీర్చిన *కోయ జాతి* స్త్రీని శబరి మాతా అన్నాడు మా రాముడు...

క్షుద్ర పక్షి జఠాయువు ని తోడబుట్టినదాన్ని గా స్వీకరించి మోక్షం ఇచ్చాడు మా రామచంద్రుడు..

*వనచరులనే* (షెడ్యూల్ ట్రైబ్) సహచరులుగా చేసుకుని ధర్మ పరిరక్షణ చేశాడు రఘురాముడు......

సేతు నిర్మాణం నిర్వహించిన రాముని సలహా దారులు నలుడు,నీలుడు *వడ్డెర కులస్థులు*

నీతి తప్పిన భ్రాహ్మాణుడి పై యుద్ధ తంత్రం రచించినది శ్రీ రామచంద్ర మూర్తి గురు తుల్యుడు *శ్రీఆది జాంబవంతుడు*మాదిగ జాతి వాడు*...

.యుద్ధం లో లక్ష్మణుడు కి ప్రాణ దానం చేసింది *గిరిజనుడైన సుశేనుడు*.....

రావణసంహారానికి సహకరించినది *భ్రాహ్మాణుడు*..

ధర్మ సూక్ష్మం రామునికి గుర్తు చేసినది *చాకలి వ్యక్తి*.......

పట్టాభిషేకానికి బంగారు జనకజను తయారు చేసింది *విశ్వ కర్మలు*.......

*మా సనాతన ధర్మం లో ఉన్న సర్వజాతి సమానత్వానికి ఇదే నిదర్శనం*.......

*విదేశీ కుక్క బిస్కెట్లు తిని మొరగె కుక్కలకేం తెలుసు హిందూ ధర్మం చరిత్ర.

Tuesday, 29 May 2018

శ్రీ మహావిష్ణువుకు అమితంగా ఇస్టమైనది...

సాధారణంగా ఆలయదర్శనానికి వెళ్ళినప్పుడు,అక్కడ అర్చకులు స్వామికి ఓ పాత్రలో నైవేద్యాన్ని పెడుతూ ఉండటాన్ని చుస్తూ  ఉంటాము..ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం. ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే చెప్పాడు.
పూర్వం గూడకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళబుచ్చేవాడు.. గూడకేశుడు విష్ణువుభక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. 
ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చెయ్యాలని  అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తప్పస్సుని మెచ్చిన విష్ణువుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావలో  కోరుకోమన్నడు. అందుకు గూడాకేశుడు, తనకు ఏమీ అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణువుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణువుచక్రం వల్ల మాత్రమే ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యడు. గూడకేశుడు సంతోషించాడు.
విష్ణువుమూర్తి అనుగ్రహించిన అనంతరం గూడకేశుడు తపస్సు చేస్తున్నే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికెను తీహాలని  విష్ణువుమూర్తి నిర్ణయించుకుని,మిట్టమధ్యానపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేర్తుందా అని ఎదురు చుస్తున్న గూడకేశుడు మిక్కిలి సంతోషించాడు.
విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెఎంటనే  అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గూడకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి.
రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చాడు . అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవెద్యం సమర్పించతం వెనుక ఇంత కథ ఉంది.
సత్యనారయణస్వామికి ఎర్రగోధుమ నూక ప్రసాదం ఎంతో ఇష్టం. పరమశివునికి చిమ్మిలి, గణపతికి కుడుములు ,మహాలక్ష్మికి పానకం,వడపప్పు,లలితా దేవికి గోక్షీరాన్నం,పులిహోర !కృష్ణుడికి అటుకులు బెల్లం..ఇలాగ ఒక్కొక్క దేవత కు ఒక్కొక్క ప్రసదం అంటే ప్రీతి.....ఆ ప్రసాదం ఇష్టం వెనుక కుడా మనకి తెలియని విషయాలు  ఎన్నో ఉంటాయి....వారికి అవి ప్రీతి అంటే...ఇంకో విధంగా ఆలోచిస్తే..అవి వారికి నివెదన చేసి  మనం స్వీకరిస్తే...మన ఆరోగ్యానికి మంచి శక్తిని ఇవ్వడమే.......ఆ నిర్గుణపరబ్రహ్మం ఎప్పుడు లోకక్షేమమే కద చూస్తాడు ..లోకసమస్త సుఖినో భవంతూ !!!!!!!