Thursday, 30 March 2017

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు. కానీ, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం...

‌🕉ఉగాది శుభాకాంక్షలు🕉

     తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు. కానీ, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది.

     నారద మహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

తెలుగుసంవత్సరాలు, ఆయనములు, ఋతువులు, మాసములు, తిధులు:

👉 మన తెలుగు సంవత్సరాల పేర్లు:

1. ప్రభవ
2. విభవ
3. శుక్ల
4. ప్రమోదూత
5. ప్రజోత్పత్తి
6. ఆంగీరస
7. శ్రీముఖ
8. భవ
9. యువ
10. ధాత
11. ఈశ్వర
12. బహుధాన్య
13. ప్రమాథి
14. విక్రయ
15. వృక్ష
16. చిత్రభాను
17. స్వభాను
18. తారణ
19. పార్థివ
20. వ్యయ
21. సర్వజిత్
22. సర్వధారి
23. విరోధి
24. వికృతి
25. ఖర
26. నందన
27. విజయ
28. జయ
29. మన్మథ
30. దుర్ముఖి
31. హేవలంభి
32. విలంబి
33. వికారి
34. శార్వరి
35. ప్లవ
36. శుభకృత్
37. శోభకృత్
38. క్రోధి
39. విశ్వావసు
40. పరాభవ
41. ప్లవంగ
42. కీలక
43. సౌమ్య
44. సాధారణ
45. విరోధికృత్
46. పరీధావి
47. ప్రమాదీచ
48. ఆనంద
49. రాక్షస
50. నల
51. పింగళ
52. కాళయుక్త
53. సిద్ధార్థి
54. రౌద్రి
55. దుర్మతి
56. దుందుబి
57. రుధిరోద్గారి
58. రక్తాక్షి
59. క్రోధన
60. అక్షయ

👉 సంవత్సరాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అది ఆయనమవుతుంది...

ఆయనములు 2: అవి...
ఉత్తరాయణము:
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు కర్కాటక రాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాలలో కొంత బాగము, పుష్యం, మాఘ, ఫాల్గుణ మాసములలో ఉండును.

దక్షిణాయణం:
కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినది మొదలు మకర రాశిలో ప్రవేశించు వరకు గల కాలము 6నెలలు. అవి ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసములలో కొంత భాగము.

👉 సంవత్సరాన్ని ఆరు భాగాలుగా విభజిస్తే అది ఋతువు అవుతుంది... అందుకే ఋతువులు ఆరు...
వసంతం, గ్రీష్మం, వర్ష, శరదృతువు, హేమంత, శిశిర.

👉 సంవత్సరాన్ని పన్నెండు భాగాలుగా విభజిస్తే అది మాసం అవుతుంది... అందుకే

మాసములు 12:
చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాడం శ్రావణ, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం (2మాసములు ఒక ఋతువు)

👉 పక్షములు 2:
ప్రతి మాసమును కూడా రెండు పక్షాలుగా విభజించారు.. అవి కృష్ణపక్షం (కృష్ణ అంటే నలుపు అని అర్థం) ఇది అమావాస్య పదిహేను రోజులకు గుర్తు... శుక్ల పక్షం పౌర్ణమి పదిహేను రోజులకు గుర్తు...
పాడ్యమి నుండి పౌర్ణమి వరకు శుక్లపక్షం
పౌర్ణమి మరునాటి పాడ్యమి నుండి అమావాస్య వరకు కృష్ణపక్షం.

👉 ఒక్కో పక్షపు పదిహేను రోజులకు పదిహేను తిథులు ఉంటాయి. అవి...

పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణమి/అమావాస్య.

👉 ఇక ఒక పక్షానికి రెండు వారములు. ఒక వారమునకు ఏడు రోజులు...

👉 ఒక రోజుకు ఎనిమిది ఝాములు... ఒక ఝాముకు మూడు గంటలు.. ఒక గంటకు అరవై నిమిషములు.. ఇలా ప్రతి నిమిషమునకు వచ్చే నక్షత్రం తో సహా మన పంచాంగం చాలా నిర్దిష్టంగా నిఖ్ఖచ్చితంగా ఉంటుంది.. ఎంత ఖచ్చితత్వమంటే.. భారత యుద్ధం జరిగే సమయమున సూర్యగ్రహణాన్ని కూడా నమోదు చేయగలిగినంత... అందుకే మన హిందూ సాంప్రదాయాలు గొప్పవయ్యాయి..

ఇప్పుడు మనం పాటించే అర్థం పర్థం లేని జనవరి ఒకటి క్రొత్త సంవత్సరం కాదు...

🕉మనకు అసలైన నూతన సంవత్సరం🕉ఉగాదే🕉 ఇప్పటినుండే మన 💎వాతావరణంలో మార్పు మొదలవుతుంది... 💎పంచాగం మొదలవుతుంది..💎 సృష్టి మొదలవుతుంది.. అందుకే ఇది యుగ ఆది అయింది.. అదే "ఉగాది" అయింది..

👉 ఇంకా వివరంగా చెప్పాలంటే శిశిర ఋతువులో రాలి పోయిన ఆకుల 💎స్థానంలో క్రొత్త చిగుళ్ళు ప్రారంభమయి.. 💎క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది... అందుకే ఇది ప్రతి ఒక్కరిలో నూతనత్వానికి నాంది పలికి.. నిత్య నూతన ఆశలతో క్రొత్త సంవత్సరం ప్రారంభమవ్వాలని..

అందరికీ...

💐నూతన సంవత్సరాది శుభాకాంక్షలు💐

Friday, 10 March 2017

Steve Waugh at River Ganga performing the last riots of his friend..ఆస్ట్రే లియా క్రికెట్ మాజీ కెప్టెన్ Steve Waugh.

ఆస్ట్రే లియా క్రికెట్ మాజీ కెప్టెన్
steve waugh

అతని మిత్రుని చివరి కోరిక ప్రకారంగా
అతని మరణ అనంతరం
ఆ అస్థికలను తీసుకువచ్చి కాశిలో గంగా నదిలో కలిపారట.
ఇదీ మన సనాతన ధర్మం గొప్పతనం.
ఇదీ మన భారత దేశ భూమి యొక్క, నదుల యొక్క ఔన్నత్యం.

ఇతర మతాలవాల్లు ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా,
నేను ఇక్కడ ఓ మాట మాత్రం నిష్కర్షగా చెప్పదలుచున్నాను.
అసలు ఏ మతంవారైనా ఈదేశంలో పుట్టారంటేనే వారు చాలా పుణ్యాత్ములని అర్ధం.
పుణ్యాత్ములు కాని వారికి ఈదేశంలో జనన మరణాలు రావు.

అంత గొప్పది మన భారత దేశం.
అందునా అవిముక్త( ఎన్నటికి ఎన్ని కల్పాలు గడిచినా యుగాంతాలలో కూడ నాశనము లేని) కాశిక్షేత్రం
ఇంకా ఇంకా ఎంతో పరమ పావనమైనది.

ఏ క్షేత్రంలోనైనా ఏదైనా పుణ్యాలు చేసుకుంటేనే ముక్తి వస్తుందేమో!
కానీ ఈ కాశి లో ఏం చేయక పోయినా ఇక్కడ చస్తే చాలు అదే ముక్తి.

అందుకే ఈ ప్రపంచంలో అంతా బతక టానికి చచ్చినంత పనై బతుకుతూ  ఉంటే
ఇక్కడ ఈ కాశిలో మాత్రం చావటం కోసమే ఎదురు చూపులు చూస్తూ బతుకుతూ  ఉంటారు.

అటువంటి ఆ కాశీ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఏ క్షేత్రమైనా వెడతాము అనుకుంటే వెళ్లి తీరాలి
లేకపోతే చాలా దోషం అని చెప్తారు.
అందువల్ల వెళ్లగలిగితేనే మొక్కు కోవాలి
లేకపోతే లేదు అంతే.
కాని కాశి క్షేత్రం అలా కాదు.
నువ్వు వెల్లగలిగినా వెల్లలేక పోయినా,

"అహం కాశీం గమిష్యామి
తత్రైవ నివసామ్యహం
ఇతి బ్రువాణ సతతం
కాశివాస ఫలం లభేత్||"

నేను కాశి వెడతాను
నేను కాశిలో ఉంటాను
ఇలా నిరంతరం అనుకున్నంత మాత్రంచేతనే
కాశిలో నివాసం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్ర వాక్యం.
అంత గొప్పది కాశి క్షేత్ర మహాత్మ్యం.

ఆ గంగా నదీమతల్లి మహాత్మం కూడా అంతటిదే.

"గంగా గంగేతి యోబ్రూయాత్
యోజనానాం శతైరపి
ముచ్యతే సర్వ పాపేభ్యః
విష్ణు లోకం సగచ్చతి||"

మనం గంగానదికి ఎన్ని వందల యోజనాల మైళ్ల దూరంలో ఉండి ఉండినా,
మనం స్నానం చేసేటప్పుడైనా
ఏ పుణ్యకార్యం చేసేటప్పుడైనా
గంగా గంగా అని పలికితే చాలు
మన సకల పాపాలు తొలగి పోయి
విష్ణు లోకాన్ని పొందుతామని పురాణ వాక్యం.

అటువంటి గంగ ఎక్కడైనా పవిత్రమే,
కాని అదే గంగ కాశిలో ఉండగా అయితే
ఆ పవిత్రత వర్ణించటం ఆ శంకరునికే అసాధ్యం.

అటువంటి ఆ కాశి గంగలో అస్థినిమజ్జన గొప్పతనం గురించి
గరుడ పురాణం లో ఓ గాధ ఉంది.
ఒక కిరాతకుడు ఆ జన్మలో తను ఎన్నో పాపాలు చేసి ఉన్నా
తన పూర్వ జన్మ సుకృతం వల్ల తన మరణానంతరం
అడవిలో పడిఉన్న అతని భౌతిక దేహంనించి
మాంసంతో కూడిన ఓ ఎముక ముక్కను
ఒక కాకి ముక్కున కరచి పట్టుకుని
గంగానదిమీదుగా పైన  ఎగురుతూ ఉండగా
ఆ కాకి ముక్కునించి ఆ ఎముక పొరపాటున జారి
ఆ గంగా నదిలో పడుట వలన అంత మాత్రం చేతనే
ఆ కిరాతకునికి మోక్షం సంభవించినదని గరుడ పురాణ వాక్యం.

అటువంటి మహా మహిమాన్వితమైన ఆ కాశిక్షేత్రం తో కూడిన
ఈ భారత దేశంలోమనం జన్మించటం మన అదృష్టం.

ఇతర దేశాల వాల్లు ఇతర మతాలవాల్లు మన భారత ధేశ వైదిక సాంప్రదాయ ధర్మం యొక్క
విలువను గుర్తించి ఈ ధర్మం పట్ల అనురక్తులు అవుతూ ఉంటే,
ఈ దేశంలో ఈ హిందూ ధర్మంలో పుట్టినకొంతమంది అజ్ఞానంతో అమాయకత్వంతో
ఎండమావులవెంట పరుగులెడుతున్నారు.

Thursday, 9 March 2017

RSS for Better Society and Socialized Citizens

I personally went to RSS sakha its all about Nation first no hatred spread on any unnecessary things that are highlighted on #paidmedia I would say its a false propaganda...by anti nationals on #RSS
RSS say do no harm or be cruel to any living being in nature.

In Sakha we were taught about #Sharirik #Dharmik #Baudhik which means
*Sharirik(Physical fitness) - starting with Suryanamaskar, sports, Arts etc
*Dharmik(Charity) - Service to society
*Baudhik(Knowledge) - Knowledge that is required to safeguard self and Nation.

Tuesday, 7 March 2017

Miss use of power over social Dignitaries...

UP me Azam khan ke adesh par shankaracharya ji or santo (sadu) par krurta se lathi se pitai karte hue  police . Please iss video ko itana viral kardo ki har hindu ke pass pahuchana chahiye. Ye video ghar ghar me pahuchana hoga.
Vandematram.

Friday, 3 March 2017

Asta Lakshmi Stuti ఆదిలక్ష్మీ సుథతి

|| ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

|| ధాన్యలక్ష్మీ ||
అహికలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

|| ధైర్యలక్ష్మీ ||
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

|| గజలక్ష్మీ ||
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాదిసమావృత పరిజనమండిత లోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారిణి పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

|| సంతానలక్ష్మీ ||
అహిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందిత పాదయుతే |
జయజయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి త్వం పాలయ మామ్ || ౫ ||

|| విజయలక్ష్మీ ||
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్య పదే |
జయజయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

|| విద్యాలక్ష్మీ ||
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయజయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

|| ధనలక్ష్మీ ||
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయజయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

Thursday, 2 March 2017

తినే ఆహరమునుబట్టి ప్రవర్తన ఉంటుందట....

తినే ఆహరమునుబట్టి ప్రవర్తన ఉంటుందట....
🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤🏤
🌾 పూర్వం ఒక శివభక్తుడు కాశీ నడిచి వెళుతూ, ప్రతీరోజు చీకటి పడేటప్పటికి దగ్గర్లోని గ్రామంలో ఎవరో ఒక గృహస్తు ఇంట ఆశ్రయం సంపాదించి అతిధిగా ఉండేవాడు. అలాగే ఒకరాత్రి ఒక గ్రామంలోని ఇంట ఆశ్రయం సంపాదించాడు.
         🌿 ఆ రాత్రి ఆ ఇంట భోజనం చేసి పడుకున్న శివభక్తుడికి, ఆ ఇంటి ముందు కట్టి ఉన్న 'ఆవు' కనిపించింది. ఆ ఆవుని దొంగతనంగా తీసుకుపోవాలనే ఆలోచన ఆ భక్తుడికి కలిగింది. ఇంట్లోని వారందరూ నిద్ర పోగానే, ఏ మాత్రం చప్పుడు లేకుండా, ఆవుని తీసుకుని బయలుదేరాడు. ఉదయానికి ఆవుతో సహా ఒక చెరువు వద్దకు చేరుకుని, అక్కడ ఆవుని కట్టి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసాడు. అప్పుడు అతనికి రాత్రి తాను చేసిన పాపపు పని గుర్తుకు వచ్చింది. వెంటనే పశ్చాత్తాప పడుతూ, ఆ ఆవును తీసుకుని ఆ గ్రామం చేరి, ఆవును ఆ ఇంటి యజమానికి అప్పగించి "అయ్యా, నన్ను క్షమించండి, ఆవును దొంగలించాలన్న దుర్భుద్ది ఎలా కలిగిందో  నాకు అర్ధం కాలేదు. ఉదయం కాలకృత్యాలు తరువాత నాపని నాకే చాలా సిగ్గుగా అనిపించింది" అన్నాడు.
              🌾ఆ ఇంటి యజమాని శివభక్తుడికి నమస్కారించి "అయ్యా! అది మీ తప్పు కాదు. నేను ఒక దొంగను. రాత్రి మీరు తిన్నది నేను దొంగలించి తెచ్చిన డబ్బుతో తయారుచేసిన భోజనం. దాని ప్రభావంతో మీకు దొంగ బుద్ధి కలిగింది.కాలకృత్యాల తరువాత దాని ప్రభావం మీలో పూర్తిగా పోయింది. అందువల్ల ఆవును తిరిగి తీసుకువచ్చారు" అన్నాడు. అప్పుడు శివభక్తుడు సంతోషించి, అక్కడి నుండి బయలుదేరాడు. తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందని దీని అర్ధం.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
🌾🌼🌾"